Bindi Yadav: From 'Bicycle Thief' To Super-Rich Businessman

Bindi yadav from thief to a rich businessman

Bindi Yadav,Rocky Yadav,Aditya Sachdeva,Bindeshwari Prasad Yadav,Lalu Prasad,Control of Crimes Act, Bihar, Cycle theif, Businessman, Bihar Elections

Among the millions of rags to riches stories we hear everyday, sometimes we realise not every one of these has a happy ending.One such life story is that of Bindeshwari “Bindi” Yadav. From being a petty criminal, he shot to infamy with his political clout and trigger-happy attitude and is now at the heart of controversy after his son allegedly murdered a 19-year-old school boy in Gaya.

కోట్లకు పడగలెత్తిన నాటి సైకిళ్ల దొంగ.. భింధు యాదవ్

Posted: 05/14/2016 12:59 PM IST
Bindi yadav from thief to a rich businessman

బీహార్ లో హాట్ టాపిక్ గా మారిన మనోరమాదేవి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు దొంగతనాలు చేసుకుని బ్రతికే ఫ్యామిలీ ఇప్పుడు ఏకంగా కోట్లకు పడగెత్తడం వార్తల్లో నిలిచింది. మొత్తంగా మరోరమాదేవి ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఇరకాటంలో పడింది. తనను ఓవర్ టేక్ చేశాడని ఓ యువకుడిని కాల్చి చంపిన కేసులో అమ్మగారి కుమార రత్నం, ఇంట్లో అక్రమంగా మద్యం ఉంచుకుందని అమ్మగారు పోలీస్ విచారణను ఎదర్కొంటున్నారు. తాజాగా ఆమె భర్తకు సంబందించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిందేశ్వర్ ప్రసాద్ యాదవ్ అనే అయ్యగారి అసలు విషయం తెలిస్తే షాకవుతారు.

బిందీయాదవ్ అంటేనే బీహార్‌లో అంతా ఠక్కున గుర్తుపడతారు! ఆయన కోట్లకు పడగలెత్తిన వ్యాపారి! బీహార్‌లో రాజకీయాల్లో ఆయనకు లేని పరిచయం అంటూ లేదు. ఆయన పేరంటే అందరికీ హడల్. కానీ.. ఆయన ప్రస్థానం ప్రారంభమయ్యింది సైకిళ్లు దొంగతనం చేసే ఒక చిన్నపాటి నేరస్తుడిలా! 1980వ దశకంలో బిందీయాదవ్ సైకిళ్లు దొంగతనం చేసిన కేసులో పోలీసులకు దొరికాడని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పటి బీహార్ నేరపూరిత వాతావరణంలో ఈ చిన్న దొంగను పెద్దగా పట్టించుకోవాల్సింది కాదు! కానీ.. బిందీయాదవ్ అనతికాలంలోనే తనను అందరూ పట్టించుకునేలా ఎదిగాడు.

1990వ దశకంలో మరో గూండా బచ్చూతో చేతులు కలిపాడు. మూడేండ్లపాటు గయ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ నేరాలకు ఇద్దరూ పాల్పడేవారు. స్థానికంగా వారికి బిందియా-బచ్చూ అని పేరు. తమ మాట ఎవరైనా జవదాటారంటే.. సహించేవారు కాదు! ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేవాళ్లు. తేడా వస్తే వాళ్ల తుపాకులే మాట్లాడేవి! క్రమంగా బిందీయాదవ్ తనంటే భయపడేలా తనకంటే ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయంలో లాలు బీహార్ సీఎం. సురేంద్రయాదవ్, రాజేంద్రయాదవ్, మహేశ్వర్‌యాదవ్‌ల అజమాయిషీలో నేరం బీహార్ నలు చెరగులా విస్తరించిన కాలమది. బిందియా-బిచ్చూ ద్వయం వారితో కలిశారు. అయితే వారి ఆగడాలు శృతిమించిపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పలేదు. ఆ సమయంలోనే తన కండ బలానికి రాజకీయ బలం తోడుకావాలని బిందీయాదవ్ గుర్తించాడు. 1990వ దశకం చివరిలో ఆర్జేడీలో చేరాడు. నేరస్తుడి హోదా నుంచి రాజకీయ నాయకుడి హోదా సంపాదించుకున్నాడు.

ఒకప్పటి సైకిళ్ల దొంగ అయిన బిందీయాదవ్‌కు ఇప్పుడు మాల్స్ ఉన్నాయి. హోటళ్లు ఉన్నాయి. గయ, బుద్ధగయ, ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో 15 పెట్రోల్ పంపులకు ఆయన ఓనర్. రోడ్ల నిర్మాణం కాంట్రాక్టులతోపాటు.. మద్యం వ్యాపారాలు కూడా ఆయనకు దిట్టంగా ఉన్నాయి. తనకు చేదోడువాదోడుగా ఉంటుందని తన భార్య మనోరమను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కూడా గెలిపించుకున్నాడు. ఇదీ బిందీయాదవ్ నేర చరిత్ర. బీహార్ లో ఇలాంటి ఎన్నో సాధ్యం. అక్కడ రౌడీలు రాజకీయ నాయకులుగా. మారడం పరిపాటి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bidni Yadav  Bihar  Cycle theif  Businessman  Bihar Elections  

Other Articles