Man bites snake, snake bites man, guess who dies first?

Jharkhand tribal man chews and kills snake that bit him

jharkhand, latehar, oraon, snakebite, poisonous snake, Venomous snake, Man eats snake, Tribal beliefs,

In a shocking incident, a Jharkhandi tribal, who was bitten by a snake, sank his teeth into it. Guess who died first? The snake died on the spot, while the man died 12 hours later.

విషాదమే.. అయినా.. పాము కన్నా మనిషే పెద్ద విషతుల్యుడా..?

Posted: 05/14/2016 01:41 PM IST
Jharkhand tribal man chews and kills snake that bit him

జార్ఖండ్‌లో గిరిజన వాసుల్లో వున్న నమ్మకం వట్టి భూటకమని తేలింది. అయితే అదే సమయంలో విషనాగుల కన్నా మనిషే అత్యంత విషపూరితుడని కూడా తేటతెల్లమైంది. ఓ గ్రామస్తుడిని విషపూరితమైన పాము కాటేసింది. దీంతో భాదితుడు పామును పట్టుకుని కొరికేశాడు. ఇదే అక్కడి వాసుల నమ్మకం. కాటేసిన పామును పట్టుకుని కొరికితే ఆ పాము విషం తమనేమి చేయదని వాళ్లు నమ్ముతుంటారు. అతను పామును కొరికగానే కేవలం గంట వ్యవధిలో పాము చనిపోయింది, కాగా బాధితుడు కూడా ఆ తర్వాత 12 గంటలకు పాము విషం వల్ల అతని శరీరంలో వ్యాపించడంతో అతడు కూడా చనిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి వేళ పాము బుస్సలు వినిపించడంతో 50 ఏళ్ల రాంథూ ఒరాన్‌ నిద్రలోంచి మేల్కొన్నారు. పొరుగు ఇంట్లోకి పాము దూరడంతో ఆ ఇంట్లోని వారు సాయం కోసం కేకలు వేశారు. దీంతో ఒరాన్‌ వెంటనే వాళ్ల ఇంట్లోకి వెళ్లి పామును తన చేతుల్లో పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. అంతలోనే అతడు పామును తన పళ్లతో కొరికేశాడు. దాంతో అది చనిపోయింది. అయితే, ఇంట్లోకి దూరిన పామును పట్టుకునే క్రమంలో అది ఆయనను కూడా కాటేసిందని ఆ తర్వాత గ్రామస్తులు, బంధువులు గుర్తించారు.

మెల్లగా విషం పాకుతుండటంతో చికిత్స కోసం ఆయనను లాతేహార్‌ జిల్లాలోని కార్మెల్ ఆశా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు ప్రత్యేక చికిత్స అందించే ఈ ఆస్పత్రిలో ఆయన 12 గంటల తర్వాత మరణించాడు. జార్ఖండ్‌లో పాముల్ని కొరకడం అసాధారణమేమీ కాదు. గతంలో ఓ గిరిజనుడిని పాము కాటేయగా.. అక్కడి ప్రజలలో వున్న నమ్మకం మేరకు బాధితుడు దానిని తినేశాడు. అయితే అతని విషయంలో ఫలించిన ఈ స్ట్రాటజీ.. ఇతడి విషయంలో మాత్రం విఫలమైంది. అందుకనే పాముకాటు వేయగానే అంటీ వెనమ్ ఇంజక్షన్ తీసుకోవాలన్న ప్రచారం అక్కడి ప్రజల్లో ప్రచారం చేయాలి. లేని పక్షంలో పాము కాట్లతో అక్కడి గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలయని పరిస్థితి ఏర్పడుతుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jharkhand  latehar  oraon  snakebite  poisonous snake  

Other Articles