Britain says it can't deport Vijay Mallya, but adds it's 'keen to help' India

Uk declines india s request to deport vijay mallya

vijay mallya, india law enforcement agency, vijay mallya case, mallya money laundering, indian economy terrorist, kingfisher airlines, money laundering probe, idbi loan fraud case, vijay mallya news, india news

The British government on Wednesday said it can't deport loans defaulter Vijay Mallya and asked India to consider requesting extradition, instead.

మన అర్థిక నేరస్థుడికి కొమ్మకాస్తున్న బ్రిటెన్..

Posted: 05/11/2016 11:06 AM IST
Uk declines india s request to deport vijay mallya

భారత దేశంలోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి.. విందులు, వినోదాలు, విలాసాలతో పబ్బం గడుపుకుని విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటెన్ ప్రభుత్వం కొమ్మకాస్తుంది. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో భారత్ కు పంపబోమని తేల్చిచెప్పిన యూనైటెడ్ కింగ్డమ్ భారత్ కు యూకే షాక్ ఇచ్చింది. దీంతో భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను ఎంత మెరుగు పర్చుకుంటుందో కూడా బ్రిటెన్ తేటతెల్లం చేసింది.

మాల్యాను స్వదేశానికి పంపించాలని ఇటీవల యూకే ప్రభుత్వాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ కోరింది. అయితే యూకే చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని దేశం నుంచి పంపించివేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసిన అధికారులు.. చివరాఖరున మాత్రం భారత్ కు ఈ కేసులో అవసరమైన సహాయాన్ని చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దమని చెప్పారు. అయితే దేశంలో వేల కోట్ల రూపాయలను ముంచేసి వచ్చిన వ్యక్తికి బ్రిటెన్ ఇలా కొమ్ముకాయడంపై కూడా విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. భారత్ విదేశాంగ శాఖ ఈ కేసులో సక్రమంగా వ్యవహరించడం లేదని కూడా అరోపణలు వినబడుతున్నాయి.

అర్థిక ఉగ్రవాదులకు బ్రిటెన్ స్వర్గధామంలా మారుతుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. వేలకోట్ల రూపాయల ప్రజాధనంలో దేశం వదలి విదేశాలకు పారిపోయిన మాల్యాను వెనక్కి తీసుకువస్తామన్న కేంద్రం వ్యాఖ్యలు కూడా నీటిమూటలుగా మారాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అండతోనే మాల్యా దేశం విడిచి వెళ్లగలిగాడని, భవిష్యత్తులో మరికోందరు వ్యాపారవేత్తలు కూడా మాల్యా బాటలోనే పయనిస్తారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

అతడిపై చర్యలు తీసుకోవాలని తమ డబ్బులు రికవరీ చేసేలా చూడాలని బ్యాంకులు కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మాల్యాను భారత్ కు తిరిగి పంపించాలని యూకే ప్రభుత్వాన్ని భారత్ ఏప్రిల్ 29న కోరింది. అదేవిధంగా గత నెలలో మాల్యా పాస్ పోర్టు కూడా రద్దయింది. మాల్యా విషయంలో చర్యలు తీసుకుని భారత్ కు తిప్పిపంపడం అసాధ్యమని, సాయం చేస్తామని యూకే అధికారులు వివరించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  UK officials  bank loans  indian economy terrorist  

Other Articles