want to work for empowerment of women in haryana says tina dabi

Delhi woman tops civil services exam

UPSC Delhi woman tops civil services exam, UPSC, civils-2015, telugu students, Tina Dabi,UPSC examination topper

Bright and bubbly Tina Dabi at 22 has just achieved what many would have taken years to achieve. Not just pass UPSC examination with flying colours but to top it.

మహిళల సాధికారతకు దోహదం చేయాలని వుంది..

Posted: 05/11/2016 10:38 AM IST
Delhi woman tops civil services exam

హర్యానాలోని మహిళ సాధికారతకు తాను దోహదం చేయాలన్నదే తన ధ్యేయమని సివిల్ సర్వీసెస్-2015 ఫలితాలలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీకి చెందిన టీనీ దాబి తెలిపింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాలలో తాను తొలి ప్రయత్నంలోనే ప్రధమ స్థానంలో నిలవడం చాలా గర్వంగా వుందన్న అమె మహిళలోకం అభ్యున్నతికి పాటుపడాలన్నదే తన లక్ష్యమన్నారు. హర్యానాలో మహిళలు అర్థికంగా, విద్యపరంగా సహా అన్ని రంగాలలో వెనుకబడ్డారని, వారిని అభ్యున్నతి దిశగా తీసుకెళ్లాలన్న తన ధ్యేయం నెరవేర్చుకునేందుకు అవకాశం లభిస్తే.. ఆ దిశగా పాటుపడతానని చెప్పారు. 22 ఏళ్ల టీనా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

జమ్మూకశ్మీర్‌కు చెందిన రైల్వే అధికారి అతర్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. అనంత్‌నాగ్‌కు చెందిన 22 ఏళ్ల అతర్ తన రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో విజయం సాధించాడు. 2014లో అతను తొలి ప్రయత్నంలో ఇండియన్ రైల్ ట్రాఫిక్ సర్వీస్(ఐఆర్‌టీఎస్)కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం లక్నోలోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇది తన కల నిజమైన సమయమని అతన్ ఫలితాల విడుదల తర్వాత చెప్పాడు.

ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్నీ తాను సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. ఇక ఢిల్లీకే చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి జస్మిత్ సింగ్ సంధు మూడో స్థానం సాధించారు. జస్మిత్ తన నాలుగో ప్రయత్నంలో మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. 2014లో అతను ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికైన జస్మిత్.. ప్రస్తుతం ఫరిదాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. తన విజయానికి తల్లిదండ్రులు, టీచర్లే కారణమని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UPSC  civils-2015  telugu students  Tina Dabi  UPSC examination topper  

Other Articles