Carp thought to have human features makes a splash on social media

Fish with human face makes splash online

A fish, human, Carp thought to have human features, A fish in China, Carp, Chinas Hunan province, Qiu Xiaohua, elementary school teacher, Wugang. The carp, 14 inches long fish human face, human face fish weighs 800 grams

A fish with a human face is caught at a reservoir, has attracted waves of visitors to its home in Wugang City, central China's Hunan province.

ITEMVIDEOS: నెట్టింట్లో సంచలనం రేపుతున్న మానవాకార మీనం

Posted: 05/11/2016 11:38 AM IST
Fish with human face makes splash online

శీర్షిక చూసి మీలోనూ ఆ మీనాన్ని చూడాలన్న అసక్తి కలుగుతుందా..? ఇదో చోధ్యం చేప మనవాకారంలో వుండటమేంటి అని సందేహిస్తున్నారా..? నిజమండీ.. సెంట్రల్ చైనాలోని హునన్ ప్రావిన్స్లో లభ్యమైన ఈ మానావాకర మీనం.. మిమ్మల్నే కాదు.. నెట్టింట్లో జనులను ఆకర్షిస్తుంది. దీనిని ఎప్పుడెప్పుడు చేస్తామా అంటూ నెట్ జనులు ఆసక్తి కనబరుస్తూ.. షేర్లు కూడా చేసుకుంటున్నారు. ఇది మానవజాతికి మేలు చేసే మీనంగా పలువురు కామెంట్లు చేస్తుండగా, మరికోందరు మాత్రం ఇదేదో అపశకునమనే భావనను వెల్లడి చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ చైనాలోని వుగంగ్ సిటీలో ఓ అరుదైన చేప అందరినీ ఆకర్షిస్తోంది. ఈ చేప తల భాగం మనిషి ముఖాన్ని పోలి వింతగా కనిపిస్తోంది. నలుపు, గోధుమ రంగుల్లో ఉన్న ఈ చేప 36 సెంటీ మీటర్ల పొడవు, 800 గ్రాముల బరువు ఉంది. విశేషమేంటంటే ఈ చేప కళ్లు, నోరు, ముక్కుభాగం మనిషికి ఉన్నట్టే ఉన్నాయి. ఈ చేప ఫొటోలు చైనా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతోంది. వుగంగ్ సిటీలో నివసిస్తున్న క్వియు ఝియోహ్వా అనే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఈ అరుదైన చేపను గత ఏప్రిల్ 30న ఓ రిజర్వాయర్లో పట్టుకున్నాడు.

క్వియు తన హాలిడేలను చేపల వేటతో జాలీగా మార్చుకుంటుంటాడు. గత 20 ఏళ్లుగా ఆయన హాలీడేలను ఇలా చేపల వేటకు వెళ్లి గడుపుతుంటాడు. అయితే, తొలిసారి ఇలాంటి అరుదైన చేప దొరికింది. దీనిని చూసి విస్మయం చెందిన ఆయన, దానిని తన ఇంట్లోని అక్వేరియంలో పెంచుకుంటున్నాడు. ఇలాంటి చేపలు ఉండటం చాలా అరుదైన చైనా మీడియా వార్తలు ప్రచురించింది. 2010లో ఇలాంటి చేప ఉన్నట్టు ఇంగ్లండ్ మీడియా వెల్లడించింది. ఈ చేపను కొనుగోలు చేసేందుకు యజమానికి 40 వేల ఫౌండ్లను ఆఫర్ చేశారని పేర్కొంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fish  human face  China  Wugang City  

Other Articles