మంత్రి పదవులు తారుమారు | Telangana cm KCR may chage deapartments to Ministers

Telangana cm kcr may chage deapartments to ministers

KCR, KTR, Jupalli Krishna Rao, Talasani Srinivas, MIssion Bhagiratha, Pachayath Raj, తెలంగాణ, కేసీఆర్, కేటీఆర్, మంత్రి పదవులు

KCR may took mission Bhagiratha, Commercial Tax departments with him. Jupally Krishna Rao may get Panchayath and Rural development.

మంత్రి పదవులు తారుమారు

Posted: 04/25/2016 09:53 AM IST
Telangana cm kcr may chage deapartments to ministers

తెలంగాణలో మంత్రి పదవుల తారుమారు మీద చర్చసాగుతోంది. కొంత మంది మంత్రులకు శాఖలు మార్చే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. దగ్గర దగ్గర ఉన్న శాఖలు ఒకే మంత్రి చేతిలో ఉంటే పరిపాలన మరింత బాగా జరుగుతుందని కేసీఆర్ ఆలోచించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర ఖజానాకు ప్రధాన వనరైన వాణిజ్య పన్నుల శాఖను సీఎం కేసీఆర్ తన వద్దనే ఉంచుకోవచ్చని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమను పరుగులు పెట్టిస్తున్న ఆ శాఖ మంత్రి కేటీఆర్ కు ఇటీవలే పురపాలకశాఖను అప్పగించారు.

నగరాలు, పట్టాణాల అభివృద్ధిలో పరిశ్రమలు కీలకమైనవి. కనుక పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖలు ఒకే మంత్రి దగ్గర ఉంటే మరింత మెరుగైన ఫలితాలుంటాయని సర్కారు పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే మంత్రి జూపల్లి వద్దనున్న పరిశ్రమలశాఖను కేటీఆర్‌కు అప్పగించవచ్చు. అలాగే మంత్రి కేటీఆర్ వద్ద ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను జూపల్లి కృష్ణారావుకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఏ పరిస్థితుల్లోనూ నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారు. దీంతో మిషన్ భగీరథను పంచాయతీరాజ్ శాఖ నుంచి విడదీసి తన చేతిలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు తన చేతిలో ఉంటేనే అధికారులను దౌడు తీయించవచ్చునన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలిసింది.

సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాలు, కొత్త దవాఖానల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వీటన్నింటికీ కావాల్సిన నిధులు వాణిజ్య పన్నుల ద్వారానే సమకూర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించి, పకడ్బందీగా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచడానికి, పన్ను వసూళ్లను నూటికి నూరు శాతం రాబట్టే ఆలోచనతో వాణిజ్య పన్నుల శాఖను చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ శాఖను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూస్తున్నారు. తలసానికి సినిమాటోగ్రఫీతో పాటు బీసీ సంక్షేమశాఖ లేదా మరో కీలకమైన శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా కొన్ని శాఖలను మార్చడం ద్వారా పాలనలో వేగం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles