కంటతడి పెట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి | CJI TS Thakur breaks down in front of PM Modi

Cji ts thakur breaks down in front of pm modi

CJI, TS Thakur, Modi, Justice, Supreme court, Judges, సుప్రీంకోర్టు, ఠాకూర్, మోదీ, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి

Addressing the inaugural session of Joint Conference of Chief Ministers and Chief Justices of High Courts, Cheif Justice of India TS Thakur said that since 1987, when the Law Commission had recommended increase in the number of judges from then 10 judges per 10 lakh people to 50, "nothing has moved".

కంటతడి పెట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Posted: 04/25/2016 08:51 AM IST
Cji ts thakur breaks down in front of pm modi

న్యాయమూర్తుల సదస్సులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌.ఠాకూర్‌ కంటతడిపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇతర పెద్దల సమక్షంలోనే సీజే కంటతడి పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఠాకూర్‌ గొంతు గద్గదమైంది. ప్రసంగం ఆపి కళ్లు తుడుచుకున్నారు. దేశంలోని న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తుండగా సీజే ఆవేదనకు గురయ్యారు. 'ప్రభుత్వానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా జడ్జీల ఖాళీలను భర్తీ చేయడం లేదు. దీని వల్ల కేసుల పరిష్కారంలో చాలా జాప్యం జరుగుతున్నది. నిందితులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. సత్వర న్యాయం అందక ప్రజలు కష్టాలు పడుతున్నారని సీజే చెప్పారు. ఆయన ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు.

ప్రభుత్వం మేకిన్‌ ఇండియా అని ప్రచారం చేస్తున్నది. కానీ, న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు పరిష్కరించడం లేదు. తన కంటే ముందు పని చేసిన అనేక మంది సీజేలు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం దక్కలేదని ఠాకూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సీజే ప్రభుత్వానికి రాసిన లేఖను ఈ సమావేశంలో చదివి వినిపించారు. ప్రస్తుతం దేశంలోని హైకోర్టుల్లో 434 మంది న్యాయమూర్తుల ఖాళీలున్నాయని సీజే చెప్పారు. ఈ ఖాళీల భర్తీ గురించి అడిగితే కేంద్రం రాష్ట్రాలు భర్తీ చేయాలని అంటున్నదని, రాష్ట్రాలు కేంద్రమే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని చెబుతున్నదని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దేశంలో 5 కోట్ల కేసులు న్యాయస్థానాల్లో నమోదు అవుతున్నాయని, వాటిలో రెండు కోట్ల కేసులనే న్యాయమూర్తులు పరిష్కరించగలుగుతున్నారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles