చంద్రబాబు నాయుడు 66వ పుట్టిన రోజు | chandrababu naidu calebrating his 66th birth day

Chandrababu naidu calebrating his 66th birth day

CM , Chandrababu naidu, Chandrababu naidu Birth day, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు

Ap Cm Chandrababu naidu how wrote a history in telugu states, celebrating his 66th grand birthda y with his family and well wishers.

చంద్రబాబు నాయుడు 66వ పుట్టిన రోజు

Posted: 04/20/2016 08:58 AM IST
Chandrababu naidu calebrating his 66th birth day

ఆయనో హైటెక్ సీఎం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా ప్రస్తుతం ఏపీలో ఉన్నా టెక్నాలజీని వాడుకోవడంలో ధిట్ట. పాలనా పరంగా ఎన్నో సంస్కరణలు చేపట్టిన నేత. ఏపీ రాజధాని నిర్మాణానికి శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. హై టెక్ సీఎం గా ఖ్యాతి గాంచిన చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 1950, ఏప్రిల్ 20వ తేదీన సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు

చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు తొమ్మిదేళ్ల పాటు సీఎంగా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనానంతరం.. పార్టీకి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిపెట్టారు. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇవాళ 66వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయన ముందు ఎన్నో సవాళ్లున్నాయి. రాజధాని నిర్మించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలాంటి అంశాలతో పాటు రాష్ట్రానికి పెట్టబడులు సాధించడం, ప్రత్యేక హోదా, విభజన సమస్యలు ఆయన ముందున్నాయి. వీటన్నింటిని ధీటుగా ఎదుర్కొంటానని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles