SUV-borne Woman Fired at on Delhi-Gurgaon Expressway

5 men harass woman shoot at her and friend for protest

Delhi woman, Delhi-Gurgaon expressway, Scorpio, new delhi, expressway, yamuna expressway, scorpio, woman fired at, lewd comments, Sanjeev Kumar, cag, Kapashera border, IFFCO Chowk, inspector Sudip Kumar, DLF-II police station, assistant jailer of Tihar, Sunil Kumar,

Unidentified miscreants fired several rounds after chasing a SUV-borne woman on the busy Delhi-Gurgaon expressway late on Sunday night.

కారులోని మహిళలపై అసభ్య కామెంట్లు.. వెంబడిస్తూ వచ్చి కాల్పులు..

Posted: 04/19/2016 04:52 PM IST
5 men harass woman shoot at her and friend for protest

అసభ్య పదజాలంతో దూషించడాన్ని వ్యతిరేకించిన ఓ మహిళలపై దుండగులు ప్రతీకారం తీర్చుకున్నారు. సినిమా ఫక్కీలో విలన్ లు చేసే చర్యల మాదిరిగా.. వెంటాడి, వేటాడిన దుండగలు, స్నేహితులతో కలసి కారులో వెళ్తున్న అమెను వెంబడించిన దుండగులు కారు అద్దాలను ధ్వంసం చేసి అమెపై కాల్పులకు తెగబడ్డారు, అడ్డువచ్చినందుకు అమె స్నేహితుడిపై కూడా కాల్పులు జరిపారు. జంగిల్ రాజ్యం, రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్న ఈ ఘటన అనునిత్యం అత్యంత రద్దీగా వుండే గుర్గావ్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే ఎక్స్ప్రెస్వేలో చోటుచేసుకుంది.

కాగా తీవ్రగాయాలపాలైన మహిళతో పాటు సిద్దాంత్ ఠాకూర్ లను వెనువెంటనే స్థానిక అస్పత్రిలో చేర్పించారు స్నేహితులు. వీరిద్దరినీ అత్యవసర చికిత్స విభాగంలో చేర్చిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా సిద్దాంత్ ఠాకూర్ కు ఎలాంటి ప్రమాదం లేదని ఆయన త్వరలోనే కొలుకుంటాడని చెప్పిన వైద్యలు, గాయపడిన మహిళ పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే వుందని చెప్పారు. అమె కొలుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని చెప్పారు. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..

ఆదివారం రాత్రి ఢిల్లీకి చెందిన ఆరుగురు స్నేహితులు స్కార్పియో వాహనంలో వెళ్తున్నారు. వీరిలో సిద్దాంత్ ఠాకూర్, దేవిశ్రీ, అసిస్టెంట్ జైలర్ సునీల్ కుమార్, ఆడిటర్ సంజీవ్ కుమార్ మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. దారి మధ్యలో ఓ మద్యం షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్న మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కారులో ఉన్న మహిళ ఎదురుతిరిగి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వీరి మధ్య అక్కడే కొంత గోడవ జరిగింది, దీంతో కారులో వున్న అసిస్టెంట జైలర్ సునీల్ కుమార్ వారిని వారించి పంపించివేశారు.

దీంతో తామను ఏడాపెడ తిట్టేసిన మహిళపై వారికి కోపం పెరిగింది, దీంతో మరో ఇద్దరు అగంతకులతో కలసి మొత్తంగా ఐదుగురు దుండగలు వారిని వెంబడించి, వేటాడి ఇఫ్కో చౌక్ వద్ద అడ్డుకున్నారు, కారు అద్దాలను బేస్ బాల్ బ్యాట్లతో పగలగొట్టారు. లోపల ఉన్న సిద్ధాంత్, దేవిశ్రీలపై కాల్పులు జరిపి పారిపోయారు. సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగంతకులు కోసం పోలీసులు ప్రత్యక బృందాలను రంగంలోకి దింపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi woman  chase  Delhi-Gurgaon Expressway  firing  

Other Articles