PF stir by garment workers rocks Bengaluru, govt puts new rules on hold

Protests in bengaluru over new provident fund rules turn violent

Bengaluru, Bengaluru protests, Bengaluru-Chennai highway, garment workers, Karnataka, Pension fund, Provident Fund, Massive Traffic Jams, labour ministry, PF withdrawal, housing, health, marriage

Massive agitations rocked Bengaluru's Electronic City on Tuesday as factory workers protested pension fund withdrawal norms, news channels reported.

బెంగళూరు ఆందోళనలతో.. పీఎఫ్ విత్ డ్రాలపై వెనక్కు తగ్గిన కేంద్రం..

Posted: 04/19/2016 07:30 PM IST
Protests in bengaluru over new provident fund rules turn violent

పీఎఫ్ ఉపసంహరణ కొత్త నిబంధనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బెంగళూరులో భారీ స్థాయిలో కార్మికులు ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో కేంద్రం దిగొచ్చింది. పీఎఎఫ్ ఉపసంహరణపై కొత్త నిబంధనల అమలు అంశాన్ని జూలై 31 వరకు వాయిదా వేసింది. కార్మికులు తమ పీఎఫ్ ఖాతాల నుంచి ఇకముందు సొమ్ము ఉపసంహరణకు ఖాతాదారులకు పలు నిబంధనలు పెట్టారు. ఇకపై ఇల్లు కట్టుకోవడం, లేదా కొనడం, (హౌసింగ్) స్వీయ లేదా  కుటుంబ సభ్యులు, పిల్లలకు దంత వైద్యం సహా ఇతర వైద్య  ఖర్చులు నిమిత్తం, ఇంజనీరింగ్ విద్యకు లేదా చందాదారుని పెళ్లి సమయంలో మాత్రమే సొమ్ము విత్ డ్రా చేసే విధంగా మెలిక పెట్టడంతో కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

దీంతో బెంగళూరులో పలు రోడ్లుపైకి వచ్చిన కార్మికుల ఆందోళన రణరంగాన్ని తలపించింది. రోడ్ల కూడళ్లు వద్ద కార్మికులు, పోలీసుల మధ్య పెనుగులాట స్థావరాలుగా మారాయి. పోలీసులు లాఠీలు ఝులిపించగా.. తీవ్ర నైరాశ్యంతో వీధుల్లోకి వచ్చిన కార్మికులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దాదాపు కొన్నిగంటలపాటు వారి మధ్య ఈ ఘర్షణ కొనసాగింది. పైగా మండుతున్న ఎండలకు తోడు ఆందోళనకారుల నిరసనలు విధ్వంసం దిశగా అడుగులు వేయడంతో అటు పోలీసులు, కార్మికులు కొందరు పిట్టల్లా కూలిపోయారు. అయినప్పటికీ ఘర్షణ మాత్రం అలాగే కొనసాగింది. పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెలిక పెడుతూ ప్రకటన చేయడంతో బెంగళూరులోని కార్మికులంతా రోడ్లెక్కారు. వీరిలో గార్మెంట్ వర్కర్లే అధికంగా ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ రోడ్లపైకి వచ్చారు. పలు ప్రధాన రహదారులను దిగ్బందించారు. కూడళ్ల వద్ద గుంపులుగా చేరుకుని మానవహారాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఆందోళన ఉధృతంగా మారింది. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. బస్సులను తగులబెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో లాఠీలు తీసిన పోలీసులు దొరికిన వారిని దొరికినట్లుగా గొడ్డును బాదినట్లు బాదారు. మండుటెండలు, ఆందోళన నడుమ బెంగళూరు నగరం ఒక ఉడుకు ఉడికింది.

మరో మూడు నెలల వరకు పీఎఫ్‌ నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, కొత్త నిబంధన ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని స్ప‌ష్టం చేశారు. నూతన పీఎఫ్‌ నిబంధనతో తమకు అన్యాయం జరుగుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారని దీనిపై ఆగష్టు 1లోపు అన్ని వర్గాలతో చర్చిస్తామన్నారు. పీఎఫ్‌ కొత్త నిబంధనపై వారికి అవగాహన కల్పిస్తామన్నారు. బెంగళూరులో గార్మెంట్‌ కార్మికుల డిమాండ్లలో న్యాయం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengaluru  Provident Fund  Massive Traffic Jams  labour ministry  PF withdrawal  housing  health  marriage  

Other Articles