Chain snatchers' low tech getaway from the hi-Tech police

Chain snacthers shock police ran away with police bike

chain snatchers, getaway on police bike, LB nagar chain snatching, police bike stolen, LB Nagar Police Station, Police Bike, weapons, snacthers ran away with police bike

The Hyderabad police that was riding the media off late, with their hi-tech gadgets and mobile apps, had to face embarrassment on Tuesday when resilient chain snatchers not only managed to slip through their fingers immediately after the crime, but made their getaway on a police bike.

తెలంగాణ పోలీసులకు చైన్ స్నాచర్ల షాక్.. నగరమంతా అప్రమత్తం

Posted: 04/19/2016 03:46 PM IST
Chain snacthers shock police ran away with police bike

తెలంగాణ పోలీసులకు గత కొంత కాలంగా సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్లు ఈ సారి ఏకంగా వారికి అనూహ్యరీతిలో షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో హల్ చల్ సృష్టించిన చైన్ స్నాచర్లు మళ్లీ ఈ మధ్యకాలంలో వరుసగా రెచ్చిపోయారు. యాంటీ చైన్ స్నాచింగ్ స్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి, వారికి వాహానాలను వేగంగా నడిపించడంలో తర్పీదును ఇచ్చి.. అలాగా వారికి ఆయుధాలను కూడా ఇచ్చి.. చైన్ స్నాచింగ్ ఎక్కడ జరిగినా వారిపై కాల్పులకు తెగబడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో గత కొంతకాలంగా ఒకింత సైలెంట్‌గా ఉన్న చైన్ స్నాచర్స్ మళ్లీ పంజా విసిరారు.

తాజాగా చైన్ స్నాచర్లు సరూర్‌నగర్‌లో అలజడి స‌ృష్టించారు. సరూర్‌నగర్ పోలీస్ ‌స్టేషన్ పరిధిలో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బైక్‌పై పారిపోతున్న చైన్ స్నాచర్లను వెంబడించారు. అయితే కొంతదూరం వెళ్లిన తర్వాత స్నాచర్ల బండిలో పెట్రోల్ అయిపోవడంతో ఆగిపోయింది. దీంతో చేసేది లేక వారు అక్కడే నిలబడ్డారు. కాగా, వారిని వెంబడిస్తూ వచ్చిన పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పట్టుకుందామనుకునే లోపు వారికి అనూహ్యరీతిలో షాక్ తగిలింది.

తమను వెంబడిస్తూ వచ్చిన పోలీసుల కోసమే దుండగులు అక్కడ వెయిట్ చేసినట్లుగా మారిపోయింది సీన్. వారిని వెంబడిస్తూ వచ్చిన పోలీసులు మారణాయుథాలతో బెదరించిన దుండగులు.. వారి బైక్‌ లాక్కొన్నారు. అదే వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ట్విస్ట్‌తో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసులనే బెదిరించి చైన్ స్నాచర్లు పరారవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chain Snatchers  LB Nagar Police Station  Police Bike  weapons  

Other Articles