hief make a gold statue for his father in Banglore | తండ్రికి ‘దొంగ’బంగారంతో విగ్రహం..?

Telugu content

Father, Gujarat, Banglore, Thief, గుజరాత్, దొంగ, బంగారు విగ్రహం, బెంగళూరు

Thief from Gujarat, who came to bangore from Gujarat few years back. Navagam Bhai named thief made a golden statue for his father.

తండ్రికి ‘దొంగ’బంగారంతో విగ్రహం..?

Posted: 04/19/2016 04:43 PM IST
Telugu content

తండ్రి మీద కొడుకుకు ఉండే ప్రేమకు ఎవరూ విలువకట్టలేరు. తన పుట్టుకకు కారణమై, విద్యా బుద్దులు నేర్పిన తండ్రికి ఏ కొడుకైనా దాసుడే. అయితే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. తన తండ్రి విగ్రహానికి బంగారుతో పూత పూయించారు. అయితే విషయం పోలీసుల దాకా రావడంతో అయ్యాగారి అసలు స్వరూపం బయటపడింది. ఇంతకీ అయ్యవార్ల వృత్తి ఏంటనుకుంటున్నారు..? దొంగతనం. చిల్లర చిల్లర దొంగతనాలు కాకుండా భారీగా చోరీలు చెయ్యడం బారీగా మూటగట్టుకోవడం అతడికి బాగా అలవాటైంది. అలా అలవాటుపడిన నవగంభాయ్ అనే వ్యక్తి గురించి పోలీసులు షాకవుతున్నారు. పాపం తన తండ్రి మీద ఉన్న ప్రేమను నిరూపించడానికి దొంగగారు ఇలా ఏకంగా తండ్రి విగ్రహాన్ని బంగారుే తాపడం పట్టించాలని అనుకున్నారు. కానీ అక్కడే దొరికిపోయారు.

కర్ణాటకలోని హొసకెరెహళ్ళిలో ఉంటున్న తలపాడ్ నవగంభాయ్ వురపు శంకర్ స్వస్థలం గుజరాత్‌లో ఉంది. 2007లో కుటుంబంతో సహా ఇక్కడికి వలస వచ్చాడు. ఏడో తరగతి ఉత్తీర్ణుడైన నవగంభాయ్‌కి అతని తండ్రే గురువు. తలపాడ్ పంఝభాయ్ తన కొడుకు నవగంభాయ్‌ని దొంగతనాలు చేయడంలో నిపుణుడిగా తీర్చిదిద్దాడు. నవగంభాయ్ తాను నేర్చుకున్న విద్యను ఆచరణలో పెట్టి దాదాపు 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను, ఇతర వస్తువులను దొంగతనం చేశాడు. వాటిని గుజరాత్‌లోని తన స్నేహితుడు రాకేష్‌కు పంపించేవాడు. తాను కట్టించిన ఓ గుడిలో తన తండ్రి పంఝభాయ్, సోదరుడు గోవింద్ విగ్రహాలను పెట్టించాడు. రాకేష్‌ చేత ఆ రెండు విగ్రహాలకు బంగారు పూత పూయించాడు.నవగంభాయ్‌ ఇచ్చిన సమాచారం మేరకు గుజరాత్‌లో అతని వ్యాపారాలను నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి మితేష్ పాంచాల్‌ను, విగ్రహాల కోసం నవగంభాయ్ పంపిన బంగారాన్ని కరిగించి, ఉపయోగించిన రాకేష్‌ను అరెస్టు చేశారు. నవగంభాయ్‌పై 50 దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles