BJP MP Sonaram Chaudhary Slapped by youth at Marriage Function

Bjp mp sonaram chaudhary slapped at marriage function

Barmer MP Sonaram Chaudhary, Khartharam, bjp mp sonaram chaudhary, mp sonaram chaudhary slapped by youth, Khartharam, Premaram Bhadu, SP Paris Deshmukh, Barmer collector Sudhir Sharma

Barmer MP Sonaram Chaudhary was allegedly slapped by a youth at a marriage function following an argument over some issue here, police said today.

పెళ్లిలో బీజేపి ఎంపీకి పరాభవం.. కేసు నమోదు..

Posted: 04/19/2016 03:38 PM IST
Bjp mp sonaram chaudhary slapped at marriage function

రాజస్థాన్లోని బార్మెర్ పార్లమెంటు సభ్యుడు సోనారామ్ చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. బీజేపి ఎంపీ తన పార్టీకి చెందిన ముఖ్యనేత వివాహానికి హాజరుకాగా, ఆయనతో పాటు వచ్చిన ఓ యువకుడు ఆయనను చెంపదెబ్బ కొట్టి వెళ్లాడు. ఏదో అంశంపై ఎంపీతో చర్చించిన యువకుడు ఆ తరువాత ఒకింత కోపానికి లోనయ్యాడు, అంతే అదే కోపంలో రెచ్చిపోయిన యువకుడు బిగ్గరగా అరిచి ఏకంగా ఎంపీ సొనారామ్ చౌదరితో గొడవపడి  చెంపదెబ్బ కొట్టాడు. ఓ వివాహ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ ఘటన జరిగింది.

సోమవారం రాత్రి ఎంపీ సొనారామ్, కలెక్టర్ సహా జిల్లా ఎస్పీ, ఇతర ప్రముఖులు ఓ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్తారామ్ అనే యువకుడు అతని మిత్రడు ప్రేమారామ్ బంధుతో కలసివచ్చి ఎంపీతో ఓ విషయం గురించి మాట్లాడుతూ వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో ఊగిపోయిన ఖర్తారామ్ ఎంపీని చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటన తరువాత నిందితుడు అతని స్నేహితుడితో కలసి అక్కడ నుంచి పారిపోయినట్టు జిల్లా ఎస్పీ పారిస్ దేశ్ముఖ్ చెప్పారు.

ఎంపీ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు వారిని 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. ఖర్తారామ్తో పాటు అతడి స్నేహితుడు ప్రేమారామ్ బంధు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీకి కొద్ది దూరంలో ఉన్నానని కలెక్టర్ సుధీర్ శర్మ చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MP  Sonaram Chaudhary  slap  Barmer  khartharam  

Other Articles