అక్కడ వంటకని మంట పెడితే శిక్ష | No cooking stoves during summer in this Bihar village

No cooking stoves during summer in this bihar village

Bihar, Summer, No stoves, Summer effect, వేసవి, ఎండ, బీహార్, మంటలు, స్టవ్

The fear of devastating fires during the scorching summer in Bihar has led people in some villages to ban the use of stoves durimg daytime to cook food. Violators would be slapped with shoes and would have to pay a fine, officials on Saturday said.Fire incidents are common during the hot summer months in rural Bihar, where people are vulnerable as most still live in thatched homes.

అక్కడ వంటకని మంట పెడితే శిక్ష

Posted: 04/18/2016 11:37 AM IST
No cooking stoves during summer in this bihar village

వంట వండాలంటే మంట పెట్టాల్సిందే. అలా వంట కోసం ఓ చోట మాత్రం స్టవ్ వెలిగించినా లేదంటే కట్టెల పొయ్యిని అంటించినా భారీ శిక్షలు విధిస్తున్నారు. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. వంట కోసం స్టవ్ వెలిగిస్తే అక్కడ అదో పెద్ద సీరియస్ ఇష్యూ. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా? బీహార్ రాష్ట్రంలో. చంపారన్ జిల్లాలో వంట కోసం స్టవ్ వెలిగిస్తే భారీ శిక్షలు విధిస్తారు. ఇందుకు ప్రత్యేకమయిన కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎండలు బాగా మండిపోతున్నాయి. గత పది రోజుల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండల వేడిమికి తోడు కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టౌవ్లు వెలిగించడం వల్ల వేడితో మంటలు చెలరేగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ఉదయం 9 గంటల తర్వాత కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టౌవ్లు వెలిగించొద్దని ఆదేశాలిచ్చారు.  నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఒకవేళ ఆదేశాలను కాదని. ఉదయం 9 గంటల తర్వాత స్టౌవ్ వెలిగించిన వారికి చెప్పు దెబ్బతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. చంపారన్ జిల్లాలోని లక్ష్మీపూర్, పాటిలార్, రత్వాల్ వంటి చోట్లు ఉదయం 10 గంటల కంటే ముందే వంట చేసుకుంటున్నారు. కొంతమంది కిరోసిన్ దీపాలను కూడా వెలిగించడం లేదు. టార్చిలైట్లు, రీచార్జ్ విద్యుత్ దీపాలను మాత్రమే వినియోగిస్తున్నారు.కొందరు అగ్నిప్రమాదాలకు భయపడి వంటలు కూడా చేసుకోవడం లేదు. ఎండాకాలం అంతా ఇలాంటి నిబంధనలే అమలులో ఉంటాయంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles