Uighur boy attacks inspectors to defend family business

Chinese toddler protects family business against inspectors using a metal pipe

Chinese Toddler, family business, police inspector, metal pipe, Uighur boy attacks inspectors to defend family business, family guy, family fun pack, family feud steve harvey funny moments, family guy funniest moments, funny vides, viral videos

Uighur boy attacks inspectors to defend, protect the family business, China. Fearless toddler fights police officers, waves a metal pipe at cops who try to shut down his family's illegal market stall in China.

ITEMVIDEOS: బుడతడు పోలీసులపైకే దాడికి యత్నించాడు.. చుక్కలు చూపించాడు..

Posted: 04/15/2016 06:57 PM IST
Chinese toddler protects family business against inspectors using a metal pipe

బావి పౌరులుగా వున్న నేటి తరం బడతలు అల్లరి చేష్టలు చేయడంలో గత తరాల కన్నా ఒక అకు ఎక్కువగానే చదివారన్నది నిజం. భారత పర్యటనకు వచ్చిన బ్రిటెన్ రాజ దంపతులను అహ్వానిస్తూ అస్సోంలోని కాజీరంగా జాతీయ పార్కు అధికారులు ఏర్పాటు చేసిన ఓ నృత్య ప్రదర్శనలో మూడేళ్ల బుడతడు రాణి కాళ్లను అల్లరితో తొక్కుతూ వారిని అకట్టుకున్నాడు. ఇక ఇటు చైనాలోని మరో రెండేళ్ల బుడతుగు రమారమి పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఒక ఉక్కు వైపుతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు, అంతేకాదు ఓ పోలీసు అధికారిని కాలితో తన్నేందుకు కూడా ప్రయత్నించాడు.

చైనాలో ఓ బడ్డోడికి కోపం కట్టలు తెంచుకుంది. దాదాపు రండిరా చూసుకుందాం అన్నట్టు పోలీసులపై విరుచుకుపడ్డాడు. ఛాలెంజ్ విసురుతూ.. చేతిలోకి ఓ పైపును తీసుకుని దమ్ముంటే అడుగు ముందుకేయండి అంటూ చైనీస్ భాషలో సవాల్ విసిరినట్టు మాట్లాడాడు. ఆ బుడతడిని కంట్రోల్ చేయడానికి అక్కడే చూస్తున్న జనాలకు సైతం కష్టమైపోయింది. పోలీసులైతే వచ్చిన పని మర్చిపోయి ఆశ్చర్యంగా అలాగే చూస్తుండిపోయిరు.

అక్కడి ఒక మెయిన్ సెంటర్‌లో ఉన్న తన తల్లిదండ్రుల షాప్‌ను తొలగించడానికి వచ్చిన పోలీసులపై అతగాడు చూపించిన కోపం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బుడతడికి సర్థిచెప్పే ప్రయత్నం చేసిన ఒక పోలీసుపైకి బుడతడు దాడికి యత్నించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక పలువురు అధికారులు బుడతడి తల్లితో మాట్లాడుతుండగా, మరో అధికారి బుడతడిని జరిపించేందుకు రాగా, ఏకంగా బుడతడు ఆ అధికారిపై దాడికి యత్నించాడు, తన కాళ్లతో అతన్ని తన్నేందుకు ప్రయత్నించాడు,

అయితే అది అధికారికి తగలకుండా అతను వెనక్కు జరిగాడు. అది చూసి పోలీసు అధికారులు నవ్వుకున్నారు, ఈ బుడతడిని ఏమన్నా అది మరింత వివాస్పదం కావచ్చునన్న అందోళనతో పోలీసులు బుడతడు ఎన్ని వేశాలు వేసినా. చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయారంతే. ముచ్చటపడిన కొందరు వీడియో తీసి నెట్‌లో పెట్టగా ఇప్పుడది సంచలనంగా మారింది. కొందరు నెటిజన్లు పిల్లాడ్ని సమర్ధిస్తూ కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. మీరు కూడా అతని ఆవేశాన్ని వీక్షించండి..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese Toddler  family business  police inspector  metal pipe  funny vides  viral videos  

Other Articles

Today on Telugu Wishesh