bridegroom tourches his newly wed forth wife and absconds after three months

Groom absconds three months after fourth marriage

Four weddings, Saeed, Harassment domestic voilence, dowry harrasment, banjara hilla police station, tolichowki, paramount colony, simran sayeed, sayed yaser ahmed, groom absconding

new bridegroom and his mother tourches newly wed forth wife and absconds after three months, the inncident took place in banjara hills juridistion.

నిత్య పెళ్లికోడుకు మళ్లీ పరారయ్యాడు.. కుటుంబంతో పాటుగా..!

Posted: 04/15/2016 06:26 PM IST
Groom absconds three months after fourth marriage

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లికోడుకు మళ్లీ పరారయ్యాడు. అదేంటి నాలుగు పెళ్లిళ్తు చేసుకునేందుకు ఏ మతంలోనూ అనుమతి లేదుగా మరి అలా ఎలా పెళ్లిళ్ళు చేసుకున్నాడనేగా మీ డౌట్, చట్ట ప్రకారం పెళ్లిళ్లు చేసుకుని, వారితో కాపురం చేస్తే సమస్య కానీ, పెళ్లిళ్లు చేసుకోవడం, వధువు తరపున వచ్చిన కట్నం, బంగారు ఆభరణాలు ఇత్యాది కట్న కానులను తీసుకుని పరారై.. మరో పెళ్లి చేసుకుని అదే తంతును నిర్వహించే ప్రబుద్ధులకు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా.. దోరికే వరకే.. ఎందుకంటే ఆ తరువాత వాళ్ల సంసారం జైళ్లోనే కదా..

అయ్య బాబోయ్ ఇలాంటి వాల్లు కూడా వుంటారా..? అంటే మీ అంత అమాయకులు లేరన్నట్టే. తాజాగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఓ ఘనుడు మూడు నెలలు తిరగకుండానే నాల్గవ భార్యను వదిలి పరారయ్యాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.... టోలిచౌకి, పారామౌంట్ కాలనీలో నివసించే సిమ్రాన్ సయీద్(19) అనే యువతి వివాహం గతేడాది నవంబర్ 13న సయ్యద్ యాసర్ అహ్మద్‌తో జరిగింది. పెళ్లి సమయంలో రూ. 30 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు కట్నంగా ఇచ్చారు.

అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే సిమ్రాన్ ను అమె అత్తగారు వేధించడం మొదలుపెట్టింది. వేధింపులు మరింతగా పెరగడంతో గత్యంతరం లేని సిమ్రాన్ భర్తతో కలసి వేరు కాపురం పెట్టింది. అయినాసరే అత్త వేధింపులు ఆపకపోవడంతో వేరుకాపురం మానేసి సొంతింటికి తీసుకొచ్చింది. తన భర్త ఆభరణాల వ్యాపారి అని పెళ్లికి ముందు నమ్మించారని,  తీరా చూస్తే ఏమి చేయకుండా ఇంట్లోనే ఉంటుండటంతో పలుమార్లు గొడవలు జరిగాయి.

ఈ నేపథ్యంలోనే సిమ్రాన్‌ను ఆమె అత్త గదిలో వేసి తాళం వేసి తీవ్రం గా కొట్టేది. ఈ ఏడాది జనవరి 19న ఆమెకు వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. తన కుటుంబ సభ్యులను పిలిపించి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో సిమ్రాన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు రోజుల క్రితం భర్తతో పాటు అత్త, ఆమె కుటుంబ సభ్యులు పరారయ్యారు. దీంతో ఆరా తీసని సిమ్రాన్ కుటుంబ సభ్యులకు మోసపోయామని తెలిసి.. కన్నీళ్ల పర్యంతమయ్యారు. గత్యంతరం లేని పరిస్థితులలో పోలీసులను ఆశ్రయించారు. తనను నాల్గవ వివాహం చేసుకొని మూడు నెలలు తిరగకుండానే మోసం చేసి పరారైన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles