Met showers good news: Above average rainfall this monsoon

Imd forecasts above normal monsoon at 106 percent lpa

monsoon, monsoon 2016, india rainfall, LS Rathore, DG IMD, weather forecast india, rain, imd, imd forecast, rainfall this year, drought

"After two successive years of deficient rainfall, Monsoon 2016 is expected to be good and the country will receive 106 per cent rainfall," said LS Rathore, DG IMD, in a press conference.

దేశమంతా సగటు కన్నా అధికం.. మన దగ్గర మాత్రం నామమాత్రం..

Posted: 04/13/2016 09:34 AM IST
Imd forecasts above normal monsoon at 106 percent lpa

కరువు, ఎండలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు అందించింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. గత రెండేళ్ల కంటే ఈసారి ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ముందస్తు సమాచారం దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న 10 రాష్ట్రాలకు ఊరటనిచ్చేలా ఉంది. కరువు తాండవించడం వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పూనుకుంటున్న నేపథ్యంలో వాతావరణ శాఖ శుభవార్తనందించింది.

దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే ఈ ఏడాది 104 నుంచి 110 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ చీఫ్ ఎల్ఎస్ రాథోడ్ తెలిపారు. సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసేందుకు 94 శాతం అవకాశముందని చెప్పారు. ఎల్ నినో ప్రభావం క్రమంగా తగ్గుతోందని, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు పడతాయని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు.

అయితే దేశంలోని అన్ని కరువు ప్రభావిత రాష్ట్రాలకు శుభవార్తనందించిన వాతావరణ శాఖ తెలంగాణ, తమిళనాడు సహా ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం చేదు వార్తనందించింది. తెలంగాణ, తమిళనాడు సహా ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం ఈ సారి కూడా సాధరణం కన్నా తక్కువగానే వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలు లేక పశువులను అమ్మి ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి పట్నాలు బాట పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతున్న తరుణంలో ఈ పిడుగులాంటి వార్త మరికోందరిని కూడా పట్నాలు, నగరాల బాట పట్టేలా చేస్తుంది,

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD forecast  LS Rathore  Rains  monsoon  

Other Articles