British cricketer Adrian St John 'shot dead in Trinidad'

Aspiring british cricketer adrian st john shot dead

Chris Gayle, England cricket, West Indies cricket, British cricketer, Adrian St John, shot dead, murdered, thieves, port of spain

An aspiring British cricketer, who played for the Chris Gayle Academy in London, has died after reportedly being shot by robbers in Trinidad

బ్రిటీష్ యువ క్రికెటర్ అడ్రాయిన్ దారుణహత్య..

Posted: 04/13/2016 09:37 AM IST
Aspiring british cricketer adrian st john shot dead

బ్రిటన్కు చెందిన వర్ధమాన క్రికెటర్ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లండన్లోని క్రిస్ గేల్ అకాడమీకి చెందిన క్రికెటర్ అడ్రియాన్ సెయింట్ జాన్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. చిన్న వయస్సులోనే తాను సొంతంగా కారు నడిపించడం, ధనవంతుడిలా అగుపించడమే అడ్రియాన్ పాలిట శాపంగా మారింది, ధనవంతుడని భావించిన దుండగులు అతనిపై కాల్పులు జరిపి అతని వద్దనున్న డబ్బును, సెల్ ఫోన్ ను ఎత్తుకుపోయారు,

అలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా వున్నాయి, అధివారం రోజున అడ్రియన్ తన స్నేహితుల్ని రిసీవ్ చేసుకునేందుకు కారును పక్కకు ఆపిన సమయంలో దొంగలు అతనిపై కాల్పులకు పాల్పడ్డారు. విఛక్షణా  రహితంగా కాల్పలు జరిపిన ఘటనలో ఆడ్రియన్ అక్కడిక్కడే మృతి చెందినట్లు బీబీసీ తాజాగా స్పష్టం చేసింది. దుండగులు అతని పర్సును, వాలెట్ను సెల్ ఫోన్ సహా పలు వస్తువులను ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

దీనిపై క్రిస్ గేల్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఈ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నాడు. అతని కుటుంబానికి గేల్ ప్రగాఢ సానుభూతి తెలిపాడు. మరోవైపు ఈ విషాదకర ఘటన పట్ల క్రిస్ గేల్ ఫౌండేషన్ మేనేజర్  డోనావాన్ మిల్లర్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్రిస్ గేల్ అకాడమికి క్రికెట్ కెప్టెన్ గా ఉన్న అడ్రియన్ మృతిని జీర్ణించుకోవడం కష్టసాధ్యమన్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ క్రికెటర్ ఇలా హత్యకు గురి కావడం తమ అకాడమీలో సభ్యులను తీవ్రమైన షాక్ కు గురి చేసిందన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles