Kejriwal Offers Clerk Job to Rohith's Postgraduate Brother on Compassionate Grounds

Delhi government offers grade iv job to rohith s brother

Kejriwal, Clerk Job, Rohith, Postgraduate, Brother, Compassionate Grounds, Delhi government, Grade-IV, Rohith Vemula’s brother, Raja Vemula

Lip service and taking advantage from the incidents of atrocities on Dalits has been a tradition for political parties; and the reformist Kejriwal has proved no different.

రోహిత్ సోదరుడికి క్లర్క్ ఉద్యోగం.. కంటితుడుపు చర్యేనా..?

Posted: 04/13/2016 09:30 AM IST
Delhi government offers grade iv job to rohith s brother

రోహిత్ వేముల సోదరుడు రాజాకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. కారుణ్య నియామకం కింద గ్రేడ్ 4 (నాలుగోతరగతి) ఉద్యోగంలో రాజాను అపాయింట్ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) ఉత్తర్వులు జారీచేసింది. అయితే సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన వేముల రాజాకు నాలుగో తరగతి ఉద్యోగం కల్పించడం అతణ్ని అవమానించడమేనని విమర్శలు చెలరేగుతున్నాయి. ఇది కేవలం రాజకీయ పార్టీల కంటితుడుపు చర్యని విమర్శిస్తున్నాయి. పోస్టు గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన వ్యక్తికి క్లర్క్ పోస్టును ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన రాజా 72.8 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం అనంతరం పలు రాజకీయపార్టీలు రోహిత్ వేముల కుటుంబాన్ని ఆదుకుంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఓ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజాలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమను కలిసినప్పుడు ఉద్యోగం కల్పించాలని విన్నవించారు. ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్ సర్కార్ ఏప్రిల్ 4న నియామక ఉత్తర్వులను వెలువరించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇవ్వజూపిన గ్రేడ్ 4 ఉద్యోగంలో చేరబోయేదీ, లేనిదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వేముల రాజా మీడియాకు చెప్పారు. 'నేను ఏదైనా విదేశీ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేయాలని అన్నయ్య కోరుకునేవాడు. అతని కలల్ని నిజంచేయడమే నాముందున్న కర్తవ్యం'అని తన ఆకాంక్షను వెల్లడించారు రాజా.  

అటు నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్(నెట్)లోనూ అర్హత సాధించిన రాజాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతలుండగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఇలా నాలుగోతరగతి ఉద్యోగాన్ని ఆఫర్ చేయడం అతణ్ని అవమానించడమేనని రోహిత్ స్నేహితులు, హెచ్ సీయూ అంబేద్కర్ విద్యార్థి సంఘం నేత గుమ్మిడి ప్రభాకర్ అన్నారు. పలు సంఘాలు కూడా కేజ్రీ తీరును తప్పుపట్టారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద గ్రూప్ సి, గ్రూప్ డీ తప్ప మరే ఇతర ఉద్యోగాలు కల్పించలేమని, అందుకే విద్యార్హతల సంగతి ఎలా ఉన్నప్పటికీ రాజాకు గ్రేడ్ 4 ఉద్యోగం కల్పించామని ఢిల్లీ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi government  Grade-IV  Rohith Vemula’s brother  Raja Vemula  

Other Articles