Attacker called BJP leader before hurling shoe at Kejriwal

Man throws shoe at arvind kejriwal during odd even announcement

kejriwal shoe attack, arvind kejriwal, kejriwal odd even, arvind kejriwal shoe attack, delhi news, arvind kejriwal shoe, kejriwal shoe video, india news, kapil mishra

A shoe was hurled at Delhi Chief Minister Arvind Kejriwal by man who claimed to be from Aam Aadmi Sena, a breakaway group of AAP, during a press conference but it did not hit the AAP chief.

సీఎంపై బూటు విసిరిన అగంతకుడు.. ఘటనకు ముందు బీజేపి నేతకు ఫోన్ చేశాడు..

Posted: 04/09/2016 05:39 PM IST
Man throws shoe at arvind kejriwal during odd even announcement

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై మరోసారి దాడి జరిగింది. శనివారం మీడియా సమావేశంలో కేజ్రీవాల్ సరి-బేసి ట్రాఫిక్ నిబంధనల గురించి మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఆయనపై బూటు, సీడీలను విసిరాడు. ఇవి సీఎం పక్కనపడ్డాయి. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. కేజ్రీవాల్పై బూటు విసిరిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆమ్ ఆద్మీ సేనకు చెందిన వేద్ ప్రకాశ్గా గుర్తించారు. పోలీసులు నిందితుడిని ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్కు తరలించిన అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశాన్ని కొనసాగించారు.

కేజ్రీవాల్పై జరిగిన దాడిని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఖండించారు. కాగా కేజ్రీవాల్పై గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. 2014లో ఢిల్లీలోని సుల్తాన్ పురి ప్రాంతంలో రోడ్డు షో సందర్భంగా ఓ వ్యక్తి కేజ్రీవాల్ చెంప దె్బ్బ కొట్టాడు. అదే ఏడాది హరియాణాలో మరో వ్యక్తి కేజ్రీవాల్ పై దాడికి ప్రయత్నించాడు. ఈ ఏడాది జనవరిలో ఓ మహిళ కేజ్రీవాల్పై ఇంకు చెల్లేందుకు ప్రయత్నించింది. అయితే ఇలాంటి వరుస చర్యలకు పాల్పడుతుంది మాత్రం కేంద్రంలో అధికారంలో వున్న బిజేపీ పార్టీ అని, ఇవాళ ఘటన జరిగేందుకు ముందు అగంతకుడు బీజేపి నేతలో ఫోన్ లో మాట్లాడారని ఢిల్లీ సంస్కృతిక శాఖా మంత్రి కపిల్ శర్మ అరోపించాడు, అగంతకుడి ఫోన్ కాల్ డీటైల్స్ ను ఆధారంగా చేసుకుని పోలీసులు ఈ కేసును విచారించాలని డిమాండ్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shoe throw  Delhi CM  Arvind Kejriwal  

Other Articles