YSRCP Leader Pongulati Srinivas also joining TRS

Ysrcp leader pongulati srinivas also joining trs

POnuleti Srinivas Reddy, Ponguleti, YSRCP, YSRCP Telangana

A Leader questions YSRCP Telangana President Ponguleti Srinivas Reddy about his party change. But Srinivas Reddy condemn those statements.

పార్టీ మారతున్నావట..? వైసీపీ నాయకుడికి ప్రశ్న

Posted: 04/05/2016 04:11 PM IST
Ysrcp leader pongulati srinivas also joining trs

వైసీపీ పార్టీ నుండి వలసలు తీవ్రంగా పెరిగిపోయాయి. ఏపిలో ఎప్పుడు ఏ నాయకుడు పార్టీ నుండి వెళ్లిపోతాడో అని సొంత పార్టీ నాయకులకే గడబిడగా ఉంది. అయితే ఏపిలో పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో పార్టీ జెండా మోయడానికి కూడా ఎవరూ మిగల్లేదు. ఇక మిగిలింది కేవలం వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి ఆయన కూడా పార్టీ మారతారా..? అన్న డైలమా నెలకొంది. ఈ మధ్యన అధికార టిఆర్ఎస్ పార్టీలోకి వలసలు తీవ్రంగా పెరగడంతో ఇప్పుడు దీని మీద చర్చసాగుతోంది.

వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తాజాగా ఓ నాయకుడు అడిగిన ప్రశ్న మీడియాలో చర్చకు దారితీసింది. ఉన్న ఒక్క నాయకుడు కూడా పార్టీని వీడిపోతే ఇక పార్టీలో ఎవరూ లేకుండా పూర్తిగా ఖాళీ అయిపోతోందని తెలంగాణ వైసీపీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి.. సారూ... మీరు కూడా పార్టీ మారుతున్నారట.. కారెక్కుతున్నారట అని శ్రీనివాస్ పొంగులేటిని ప్రశ్నించారట. అయితే దానికి ఆయన పార్టీ మారే ఉద్దేశమే ఉంటే దొంగచాటుగా మారనని, అయినా గతంలోనే తనకు మంత్రి పదవి ఆఫర్ వచ్చినా కానీ మారలేదని అన్నారు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : POnuleti Srinivas Reddy  Ponguleti  YSRCP  YSRCP Telangana  

Other Articles