Jagan said that what we told CAG also said same

Jagan said that what we told cag also said same

YS Jagan,. Chandrababu Naidu, AP, Assebly, CAG, CAG Report, YSRCP, Jagan

YS Jagan Mohan Reddy one more time slam AP CM chanrbabi Naidu. He said that his party condemn chandrababu naidu govts polices. CAG also identified same issues which YSRCP rise.

మేం చెప్పిందే కాగ్ చెప్పింది: జగన్

Posted: 03/31/2016 04:36 PM IST
Jagan said that what we told cag also said same

తాము గతంలో చెప్పిన విషయాలనే కాగ్ కూడా తన నివేదికలో వెల్లడించిందని.. చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తోందని జగన్ అన్నారు. రాజ్యాంగబద్దంగా ఎస్సీ,ఎస్టీలకు ఖర్చు చేయాల్సిన నిధులపైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని జగన్ ఆరోపించారు. 2014-15 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం 4 వేల 779 కోట్లు కేటాయిస్తే వాటిలో కేవలం 1504 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు.

ఈ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ప్రస్తావించిన అంశాలను జగన్ మీడియాకు తెలియజేశారు. అగ్రిగోల్డ్ స్కాం, రాజధానిలో భూదందా అంశాలను సభలో ప్రస్తావించామన్నారు. భూములన్నీ కొనుగోలు చేసిన తర్వాత రాజధాని ప్రకటించడంపై ప్రశ్నించామన్నారు. చంద్రబాబు తమవారి భూములను పూలింగ్ నుంచి మినహాయించారన్న జగన్.. చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు పై ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్న ఆయన.. ఇసుక దందాలో చంద్రబాబుకు వాటాలున్నాయని ఆరోపించారు. రెండేళ్లు దోచుకున్న తర్వాత ఇప్పుడు ఇసుక ఫ్రీ అనడంలో అర్థం లేదన్నారాయన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  . Chandrababu Naidu  AP  Assebly  CAG  CAG Report  

Other Articles