Why Mallya, Lalit Modi still abroad? Rahul Gandhi asks Modi

What did arun jaitley and vijay mallya discuss in parliament asks rahul gandhi

vijay mallya, bad debts, kingfisher group, 5 state elections, rahul gandhi, assam meeting, black money, arun jaitley, pm modi, assam elections, narendra modi,

Modi talks about bringing back black money and on the other hand Mallya flees the country, says Rahul Gandhi.

విజయ్ మాల్యాతో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చర్చల మర్మమేమిటీ..?

Posted: 03/31/2016 05:44 PM IST
What did arun jaitley and vijay mallya discuss in parliament asks rahul gandhi

నల్లధనం మీద పోరాడుతానని ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు చెబుతూనే ఉన్నా, మరోవైపు మాల్యా లాంటివాళ్లు మాత్రం దేశం వదిలి పారిపోతారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మాల్యా వెళ్లిపోవడానికి రెండు మూడు రోజుల ముందు కూడా పార్లమెంటులో అరుణ్ జైట్లీతో మాట్లాడారని, వాళ్లిద్దరి మధ్య ఏం మాటలు నడిచాయని ప్రశ్నించారు. వారిద్దరి భేటీలో మర్మమేంటని ఆయన నిలదీశారు. ప్రధాని నిజంగా అవినీతిపై పోరాడుతుంటే, ఆయన ఎందుకు 'ఫెయిర్ అండ్ లవ్లీ' స్కీము ప్రవేశపెట్టారని రాహుల్ నిలదీశారు.

దేశంలో ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. అక్కడ ప్రజలను విడదీసి హింసను రెచ్చగొడుతోందని, అసోంలో కూడా హింస తిరిగొస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి ఏమైపోవాలని రాహుల్ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలోని డిగ్బోయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. మన ముందు ఎన్నికలు వస్తున్నాయని, రెండు రకాల ఆలోచనల మధ్య పోటీ ఉందని చెప్పారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ ఉన్నారన్నారు. ప్రధాని ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి గురించి మాట్లాడతారు గానీ, బీజేపీ ఏ రాష్ట్రంలో గెలిచినా అక్కడ మాత్రం హింస చెలరేగుతుందని రాహుల్ అన్నారు.

ప్రతి జిల్లాలో సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరయ్యే వంద మంది విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్పులు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అసోంలో మళ్లీ అధికారంలోకి వస్తే కిలో బియ్యం రూ. 2కే అందిస్తామన్నారు. అసోం మినీ భారతదేశమని, దేశవ్యాప్తంగా ఏవేం ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయని చెప్పారు. మోదీ ఇక్కడకు వస్తే మాత్రం నల్లధనం గురించి గానీ, మాల్యా గురించి గానీ, లలిత్ మోదీ గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడరని ఎద్దేవా చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay mallya  5 state elections  rahul gandhi  assam meeting  black money  arun jaitley  pm modi  

Other Articles