KCR announce that they will provide irrigation to one crore acers land

Kcr announce that they will provide irrigation to one crore acers land

KCR, Irrigation, PowerPoint Presentation, Assembly, Obe crore acers, Telangana

KCR announce that they will provide irrigation to one crore acers land. He gave excellent power point presentation on Irrigation projects. He describe all irrigation projects with stats.

కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తాం: కేసీఆర్

Posted: 03/31/2016 03:48 PM IST
Kcr announce that they will provide irrigation to one crore acers land

తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన నినాదం.. నీళ్లు, నిధులు, నియామకాలు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిదులు స్వంతంగానే కేటాయించగలుగుతున్నాము. ఇక నియామకాలు చేపడుతున్నాం.. ఇక తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే నీళ్లు కావాలి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఉద్వేగంగా ప్రకటించారు. తెలంగాణ ఉనికిని కాపాడుకుంటూనే, తెలంగాణ బిడ్డలు ఇంకా బాగా బ్రతకడానికి, తెలంగాణ రైతుల ప్రతి ఎకరం భూమి కూడా సాగునీటితో తడవాలని తన సంకల్పమని ప్రకటించారు. తాను చెప్పినట్లుగా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించి.. రైతుల కళ్లలో ఆనందం చూస్తానని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.

 ఉమ్మడి రాష్ట్రంలో చెరువులన్నీ ధ్వంసమై పోయాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కోటీ 11 లక్షల కోటీ ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ సరిపడనంతా నీరు పారలేదు. చాలా వరకు భూములన్నీ బీడుగానే ఉన్నాయి. తమ గోస ఆగేదెన్నడని రెండు నదీమ తల్లులను ఏళ్ల తరబడి వేడుకున్నానని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో తాను వేసిన నాణేలు బహుశా మరెవరూ వేసి ఉండరు అని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టు అనగానే అంతర్ రాష్ట్ర వివాదాలు.. లేకుంటే పర్యావరణ సమస్యలు ఉండేవన్నారు. తెలంగాణ నీటి కేటాయింపులు ఫైళ్ల మీద స్పష్టంగా ఉన్నాయన్నారు. జూరాల కడితే నీళ్లు నింపుకోలేని పరిస్థితి, ఆనాడు రాజోలిబండకు బాంబులు పెట్టి నీళ్లు మళ్లించుకున్నారని గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Irrigation  PowerPoint Presentation  Assembly  Obe crore acers  Telangana  

Other Articles