KCR always keep one rupee coins in his pocket

Kcr always keep one rupee coins in his pocket

KCR, River, coins, Rupee Coin, Telangana, Assembly

Telangana cm KCR said that he will always keep one rupee coins. He will through the coins into the River any prays.

కేసీఆర్ వద్ద రూపాయి బిళ్ల ఎందుకంటే..

Posted: 03/31/2016 03:40 PM IST
Kcr always keep one rupee coins in his pocket

కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలొ జలవిధానం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అందులో బాగంగా తెలంగాణకు నీళ్లు ఎలా తీసుకురావాలో, ఎలా నీటిని ఒడిసిపట్టుకోవాలో ఆయన వివరించారు. అయితే తన స్పీచ్ ను ప్రారంభిస్తూ తాను ఎప్పుడూ రూపాయి బిళ్లలు జేబులో పెట్టుకొని తిరుగుతానని, ఒకవేళ తాను మరిచిపోతే తన డ్రైవర్ రూపాయిబిళ్లలను గుర్తు చేసి మరీ తీసుకువస్తాడని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తలుచుకుంటే నోట్ల కట్టలే జేబులోకి వచ్చి చేరుతాయి కదా మరి ఇదేంటి రూపాయి బిళ్లలు పెట్టుకొని తిరగడటం ఏంటి అనుకుంటున్నారా..? దానికి ఓ స్టోరీ ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి నదుల మీద నుండి తన ప్రయాణం సాగేటైంలో నదిలోకి రూపాయి బిళ్లలు వెయ్యడం సంప్రదాయం అట. అందుకే ఎప్పుడు బయటకు వెళ్లినా కానీ తన వెంట రూపాయి బిళ్లలు పెట్టుకొని తిరుగుతారట. నది దాటే సమయంలో ఒక రాగి నాణెమో, వెండి నాణెమో వేయడం సంస్కారం. కృష్ణా, గోదావరినదుల్లో తాను వేసిన నాణేలు తెలంగాణలో ఏ వ్యక్తి వేసి ఉండకపోవచ్చని కేసీఆర్ తెలిపారు. ఈ విషయం ఆదిలాబాద్, మహబూబ్ నగర్,కరీంనగర్ పోలీసులకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. నాణెం నదిలో వేసిన తరువాత తల్లీ గోదావరీ, తల్లీ కృష్ణమ్మా ఎప్పుడు మా బీడు భూముల్లోకి వస్తావ్..ఎన్నడు మా బీడు భూములను తడుపతవ్ అని నిండు మనసుతో ప్రార్థించి దండం పెట్టుకుని అక్కడ్నుంచి కదిలుతామని కేసీఆర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  River  coins  Rupee Coin  Telangana  Assembly  

Other Articles