chadrbabu Naidu said i cant sleep after watching some cinemas

Chadrbabu naidu said i cant sleep after watching some cinemas

Chandrababu Naidu, Chandrababu, balakrishna, Ap, Amaravathi

chadrbabu Naidu said i cant sleep after watching some cinemasIn Raja cheyyi vesthe Audio function he spoke. He also said that cinemas must to improve peopls health.

రాత్రి నిద్ర కూడా పట్టదు: చంద్రబాబు

Posted: 03/26/2016 09:28 AM IST
Chadrbabu naidu said i cant sleep after watching some cinemas

ఈ మధ్యన పాలిటిక్స్ కు, సినిమాలకు మంచి కనెక్షన్ కుదురుతోంది. చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు కొంత మంది మంత్రులు కూడా సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్నారు. తాజాగా రాజా చెయ్యి వేస్తే అనే సినిమా ఆడియో ఫంక్షన్ కు ఆయన హాజరయ్యారు. నిర్మాతలు తీసే సినిమాలను చూసి ప్రజల ఆరోగ్యం బాగుపడాలి కాని, లేనిపోని జబ్బులు రాకూడదని ఆయన సూచించారు. సినిమా వినోదం కోసమని, అయితే కొన్ని సినిమాలు చూస్తే భయం వేస్తుందన్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాలు వేరేగా ఉంటాయని, మరికొందరి సినిమాలు చూస్తే రాత్రి నిద్ర పట్టదన్నారు.

ఏపీలో షూటింగ్‌లకు ప్రపంచంలోనే ఎక్కడా లేని బీచ్‌లు, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని ఏపి ముఖ్యమంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తమ కుటుంబం నుంచి వచ్చిన నారా రోహిత్ ‘బాణం’లా దూసుకుపోతున్నాడన్నారు. అమరావతిలో నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లినప్పుడు అక్కడ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఒక స్థూపం వద్దకు తీసుకువెళ్లారని, అక్కడ 755 ఏళ్లకు ముందు ఇదే రోజున రాణి రుద్రమదేవి పట్టాభిషేకం చేయడం, ఆవిడ పుట్టినరోజు కావడం విశేషమన్నారు. అదేరోజు ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న ‘రాజా చెయ్యి వస్తే’ విజయం సాధిస్తుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Chandrababu  balakrishna  Ap  Amaravathi  

Other Articles