Cheating case on ringing bells

Cheating case on ringing bells

Ringing bells, Freedom251, Freedom phones

Cheating case filed on ringing bells. Ringing bells owner Mohith Goel and President Ashok chadda names add in this FIR.

చీటింగ్ కేసులో చిక్కుకున్న రింగింగ్ బెల్స్

Posted: 03/26/2016 11:17 AM IST
Cheating case on ringing bells

రింగింగ్ బెల్స్ గుర్తుంది కదా…. అదేనండి రూ.251కే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించింది కదా.. ఆ కంపెనీయే. ఇప్పుడీ కంపెనీ యాజమాన్యంపై చీటింగ్ కేసు నమోదైంది. సెక్షన్‌ 420 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు నోయిడా పోలీసులు. రింగింగ్‌ బెల్స్‌ యజమాని మోహిత్‌ గోయెల్‌, అధ్యక్షుడు అశోక్‌ చద్దాల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. భాజపా నేత కిరీట్‌ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. కేవలం రూ.251కే స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తామన్న సంస్థ ప్రకటన అవాస్తవమని తెలిపింది.  

ఈ ధరకు స్మార్ట్‌ ఫోన్‌ను తయారు చేయడం సాధ్యం కాదని, ఇది ప్రజలను మోసపుచ్చడమేనని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసినట్లు సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌.కిరణ్‌ తెలిపారు. తదుపరి విచారణకు అవసరమైన పత్రాలను అందించాల్సిందిగా సంస్థను కోరినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అనూప్‌ సింగ్‌ వివరించారు. పోలీసుల విచారణకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు మోహిత్‌ గోయెల్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ringing bells  Freedom251  Freedom phones  

Other Articles