'Anti-National' Search Leads To JNU On Google Maps

Anti national search leads to jnu on google maps

Google, India, JNU, anti natinal

A search for key words like "anti-national", "sedition", "patriotism" and "Bharat mata ki jai" on Google Maps is directing users to JNU or Delhi's Jawaharlal University or JNU, where three students, including Kanhaiya Kumar, were arrested last month.

మరో వివాదం లో గూగుల్ - ‘రాజద్రోహం’ టైప్ చేస్తే..

Posted: 03/26/2016 09:18 AM IST
Anti national search leads to jnu on google maps

అసలే దేశంలో దేశద్రోహం వివాదం కాకరేపుతుంటే.. ఈ వివాదంలోకి గూగుల్ కూడా వచ్చేసింది. అవును ఇంటర్నెట్ రారాజు గూగుల్ తన గూగుల్ మ్యాప్‌లో యాంటీ నేషనల్ (జాతి వ్యతిరేక), సెడిషన్ (దేశద్రోహం), పేట్రియాటిజం (దేశభక్తి), భారత్ మాతాకీ జై అనే పదాలను టైప్ చేస్తే.. ఆ పదాల ఫలితాలు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీని చూపించడం వివాదాస్పదంగా మారింది. జేఎన్‌యూను జాతి వ్యతిరేక సంస్థగా పేర్కొనడం ప్రతిష్ఠను దెబ్బతీయడమేనని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ నేత షెహ్లా రషీద్ షోరా పేర్కొన్నారు.

గూగుల్ మ్యాప్‌లో ఇలాంటి ఫలితాలు రావడం అత్యంత ప్రమాదకరమని సాయి బా లాజీ అనే విద్యార్థి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారాన్ని గూగుల్ దృష్టికి తీసుకురాగా.. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ నిర్వాహకులు సమాధానమిచ్చారు. గతంలో కూడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో బారత ప్రదాని నరేంద్ర మోదీ ఫోటో రావడం వివాదానికి కారణమైంది. ఇప్పుడు మళ్లీ జెఎన్ యు వివాదం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  India  JNU  anti natinal  

Other Articles