Twitter Erupts as PM Modi and SRK Laud Team India’s Performance

Pm modi lauds team india for thrilling win over bangladesh

Narendra Modi, Team India, Amitabh Bachchan, Shah Rukh Khan, India vs Bangladesh, World T20 2016, ICC World T20, india thrilling win, social media, celebrities laud team india win

prime minister of india narendra modi lauds Team India performance and says it gives a new message that never lose hope

ఆశను సజీవంగా వుంచండీ.. చివరి నిమిషంలోనూ విజయం రావచ్చు..

Posted: 03/24/2016 06:10 PM IST
Pm modi lauds team india for thrilling win over bangladesh

ఆశలను సజీవంగా వుంచుకోండి.. అది మీ జీవితాలలో ఎప్పుడైనా వెలుగులను తీసుకురావచ్చని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో కూడా విజయాలు మీ ముంగిట వాలవచ్చునని, అందుచేత ఆశలను నిత్యం సజీవంగా వుంచుకోవాలని హితవు పలికారు. మనిషి తన దైనందక జీవితంలో ఎదరయ్యే అన్ని విషయాలలో ధైర్యంగా ఎదుర్కోవాలని, ఇక జీవితం ముగిసిపోయిందనుకుని ఎవరూ తోందరపాటు చర్యలకు పూనుకోరాదని సూచించారు. ఇందుకు టీమిండియానే చక్కని ఉదాహరణ అని పేర్కోన్నారు.

టీమిండియా టీ 20 ప్రపంచ కప్ లో సెమీస్ కు వెళ్లేందుకు కీలకంగా మారిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ముగిసిన తరువాత ధోని సేనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని తన ట్విట్ లో ఈ విషయాన్ని పేర్కోన్నారు. చివరి ఓవర్ 6 బంతులలో 11 పరుగులు చేయాల్సిన అవసరం బంగ్లాదేశ్ జట్టుకు ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ లో కీలక ఓవర్ లో మూడు వికెట్లు సాధించిన టీమిండియాకు ప్రధాని ప్రశంసించారు. ప్రధాని కూడా టీమిండియా పోరాట స్పూర్తికి ముగ్దుడయ్యాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా మ్యాచ్‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వీక్షించారు.

అంతేకాదు తన అభిమానులతో మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ ద్వారా తన అనుభూతులను పంచుకున్నారు. గేమ్ చాలా థ్రిల్లింగా ఉందంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు. చాలా సంతోషంగా ఉందని, బంగ్లాదేశ్ కూడా బాగా ఆడిందని అన్నారు. అయితే, ఈ మ్యాచ్ మనందరికీ ఒక సందేశం ఇస్తోందని గుర్తు చేశారు. ఎప్పుడూ అంతా అయిపోయిందని వదిలిపెట్టేయకూడదని, ఆశను సజీవంగా వుంచండీ.. జీవితం ఏ క్షణంలోనైనా ఏ మలుపైనా తీసుకోవచ్చని.. ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs bangladesh  t20 world cup  india thrilling win  narendra modi  social media  

Other Articles