Kanaiah Kumar is not role mode

Kanaiah kumar is not role mode

Kanaiah Kumar, JNU, delhi, Modi, JNU Row

JNU Student kanaiah Kumar who is becoming political leader is not a role model for any student. He is playing just politics.

ఊసరవెల్లిలాంటి కన్హయ ఆదర్శమా..?

Posted: 03/24/2016 04:59 PM IST
Kanaiah kumar is not role mode

కన్హయ కుమార్ మూడు నెలల క్రితం కనీసం ఈ పేరు కూడా ఎవరికీ తెలియని ఓ మామూలు వ్యక్తి. జాతీయ మీడియా పుణ్యమా అని రాత్రి రాత్రే ఫేమస్ అయ్యారు. ఇక సోషల్ మీడియా పుణ్యమాని అని అయ్యవార్లకు ప్రచారానికి కొదవలేదు. కన్హయ నోటి నుండి వచ్చిన నాలుగు మంచి మాటలు... ప్రపంచాన్ని మార్చేస్తాయి అన్నంతలా అందరూ ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రాధాన్యతనిస్తున్నారు. అయినా వామపక్షభావాలున్న కన్హయ కుమార్ ఓ పక్షాన పోరాడున్నాడో లేదో కానీ జోకులు మాత్రం భలే వేస్తున్నాడు. అదేంటి కన్హయ కుమార్ జోకులు వెయ్యడం ఏంటా అనుకుంటున్నారా..? అవును ఆయన కళను మీరు కూడా తెలుసుకోండి.

ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడైన కన్హయ కుమార్ దేశానికి వ్యతిరేకంగా నినాదలు చేశాడని.. దాంతో కొన్ని వీడియోల ఆధారంగా ఆయన మీద దేశద్రోహం కేసు నమోదు చేయడం తర్వాత పెద్ద రచ్చ జరగడం అంతా ముగిసిందిజ. ఇక ఇప్పుడు కన్హయ కుమార్ విద్యార్థి దశ దాటి మారుతున్న ఊసరవెల్లిలా మారిపోయారు. రంగులు మారుస్తూ.. రాజకీయాలలో కూడా మారుతున్న పరిస్థితుల నుండి తనకు తానుగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. కన్హయ కుమార్ ను హైలెట్ చేసింది ఎవరు..? ఓ వర్గానికి చెందిన మీడియా ఛానల్స్ కన్హయ కుమార్ ను జాతీయ స్థాయిలో హైలెట్ చేశాయి. మరి ఇదంతా ఎలాంటి రాజకీయ లాభం లేకుండా చేశాయని మీరు అనుకుంటున్నారా..?

ఇక దేశద్రోహం కేసులో జైలుకు వెళ్లిన కన్హయ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు జరిగిన హడావిడి గురించి అయితే చెప్పక్కర్లేదు. కొంత మంది అయితే కన్హయ కుమార్ బయటకు రాగానే రంగులతో హోళీ కూడా ఆడేశారు. దిల్లీ జెఎన్ యు క్యాంపస్ కు వెళ్లిన కన్హయ మంచి స్పీచ్ ఇ,చ్చారు. అయితే తన స్పీచ్ లో ప్రభుత్వాల మీద విమర్శలు చేసిన విధానం ఎంత వరకు కరెక్ట్. మోదీ ప్రభుత్వం కావాలనే తన మీద కేసులు పెట్టిందని... అయినా కూడా తాను భయపడేది లేదని అన్నారు. సరే దీని గురించి పక్కన బెడితే ఆయన దేశానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలను ఎలా సమర్థించాలి.

ఇక ప్రభుత్వాల నిర్లక్షం ఖచ్చితంగా ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది అని అందరికి తెలుసు. అయితే కన్హయ మాత్రం దేశంలో అసలు ప్రభుత్వాలు చేసిందేమీ లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. ప్రభుత్వం అనేది ప్రజలు ఎన్నుకుంటేనే ఏర్పడింది అంతే తప్పితే వారసత్వం నుండి వచ్చింది కాదు. అంటే పరోక్షంగా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా కన్హయ కుమార్ వెక్కిరిస్తున్నట్లే. ఇక మోదీ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణల గురించి వస్తే.. మోదీ ఇదంతా చెయ్యమని ఎక్కడైనా ఆదేశాలు జారీ చేశాడా..? పోనీ మోదీ దీని వెనక ఉండి నడిపిస్తున్నాడా..? లేనేలేదు. కానీ కన్హయ మాత్రం ఇదంతా మోదీ డైరెక్షనే అని అంటున్నారు.

ఇక కన్హయ కుమార్ గారి హైదరాబాద్ పర్యటనలో రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని.. అలా తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించారు. అసలు రోహిత్ చట్టం అంటే ఏమిటి..? ఎందుకు అవసరం..? ఎవరికి అవసరం..? రోహిత్ అనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మమత్య చేసుకున్నాడు. దాని మీద రాజకీయ నాయకులు పెద్ద దుమారాన్ని రేపారు. ఇదే కన్హయ కుమార్ కు ఓ విషయం అర్థంకావాలి. విద్యార్థి ఆత్మహత్యను ఏ రకంగానూ సమర్థించకూడదు కానీ అదే టైంలో అదే కన్హయ వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వాడినే అని చెప్పుకుంటున్నాడు కదా మరి గత ప్రభుత్వాలు తన కుటుంబానికి చేసిందేమిటి..? మోదీ సర్కార్ ఇప్పుడు చెయ్యనిది ఏమిటి..?

రోహిత్ ఆత్మహత్య విషయంలో ఎన్నో కోణాలున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు ముందు ఓ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడాడని. ఓ వీడయో కూడా బహిర్గతమైంది. మరి దీని మీద అదే కన్హయ కుమార్ గానీ. రోహిత్ ది హత్య అని వాదిస్తున్న వారు ఎందుకు స్పందించలేదు. సరే దీని గురించి వదిలేస్తే... రోహిత్ ఆత్మహత్యకు, కన్హయకు ఎలాంటి సంబందం లేదు. అయినా సరే సాటి విద్యార్థిగా స్పందించాడని అనుకుందాం.. కానీ రోహిత్ చట్టం తీసుకురావాలని వాదించడంలో ఎలాంటి అర్థం లేదు.

రోహిత్ ను యూనివర్సిటీలో ఎక్కడా కూడా చిన్న చూపుతో చూడలేదు. అందరు విద్యార్థులతో పాటే ఆయనను కూడా ట్రీట్ చే:శారు. ఇక ఆయన దళిత కార్డు పట్టుకొని తన ఇష్టారాజ్యం చేశాడని అందరికి తెలుసు. ఇప్పడు వెనకేసుకు వస్తున్న రోహిత్ వేముల దళిత కార్డు ఎక్కడా వాడలేదా..? అయినా అసలు ఆయన దళితుడేనా..? రోహిత్ తండ్రి మాత్రం తాము దళితులం కాదని అంటన్నారు. కానీ తల్లి మాత్రం తాము దళితులమని అంటున్నారు. మరి దీని మీద స్పందించారా..? కన్హయ కుమార్.

ఇక మోదీ సర్కార్ ను ఎవరు తిట్టినా కూడా రాహుల్ గాంధీలాంటి వ్యక్తులు వంతపాడతారు. చివరకు కుక్క మొరిగినా కూడా మోదీ సర్కార్ వచ్చినప్పటి నుండి కుక్కలు కూడా అసహనంతో ఉన్నాయంటూ మీడియాలో ఎంతో హుందాగా ప్రకటిస్తారు. మరి రాజకీయాలతో సంబందం లేని కన్హయ కుమార్ ఏ కారణంతో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని కలిశాడు. రాహుల్ తో ఏం మాట్లాడారో అటు రాహుల్ కానీ ఇటు కన్హయ కుమార్ కానీ ఎందుకు వెళ్లడించడం లేదు. అంతర్గతంగా ఏదో రాజకీయ లాభం మీద అవగాహన కుదిరింది అన్న అనుమానాలకు ఎందుకు బలం చేకూరుస్తున్నారు.

ఇక అన్నింటికి మించి విద్యార్థి దశలో చదవు వదిలేసి రాజకీయ చదరంగంలో పావుగా ఎందుకు మారుతున్నారు. విద్యార్థి దశ నుండి రాజకీయ నాయకుడిగా మారే క్రమంలో ఇలా ఊసరవెల్లిలా మారారు అని ఎందుకు అనుకోకూడదు. ఇక మిత్రపక్షాల హడావిడి అయితే అంతా ఇంతా కాదు. సీపీఐ నారాయణ అంతటి ఉద్దండపండితుడు స్వయంగా వచ్చి కన్హయకు స్వయంగా వచ్చి రాచమర్యాదలు చెయ్యడం ఎందుకు..? నారాయణకు ఏం అవసరం అని అలా చేస్తున్నారు. మోదీ సర్కార్ చేస్తున్న తప్పొప్పులను పక్కనబెడితే.. కన్హయ కామెంట్లు చేసిన తీరే కొందరికి నోళ్లు తెలిచేలా చేసింది. చదువుమానేసి పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారుతున్న కన్హయ లాంటి వ్యక్తి సాటి విద్యార్థులకు ఎంత మాత్రం ఆదర్శప్రాయం కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kanaiah Kumar  JNU  delhi  Modi  JNU Row  

Other Articles