These are the Iphone 7 series features

These are the iphone 7 series features

Iphone7, Iphones, Apple phones, Iphone7

It’s no surprise that hype for the iPhone 7 and iPhone 7 Plus is already building. Here’s everything we know about Apple’s biggest launch of 2016, including the iPhone 7 release date, price, rumours, videos, images, features, and specs.

ఐఫోన్ 7 ఫీచర్లు ఇవే..

Posted: 03/24/2016 02:46 PM IST
These are the iphone 7 series features

అమెరికా దిగ్గజ సంస్థ ఆపిల్ మరిన్ని విప్లవాత్మక ఫీచర్లతో త్వరలోనే ఐఫోన్ 7 సిరీస్‌ను తీసుకురానుంది. కొత్త పీచ‌ర్ల వివ‌రాలు అందరికి బాగా నచ్చుతున్నాయి. ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్ల కోసం ఉపయోగించే సాకెట్‌ను, బ్యాటరీ చార్జింగ్ కోసం ఉపయోగించే 3.5 జాక్‌ను పూర్తిగా ఎత్తివేస్తోంది. అంటే, ఇకముందు వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ చార్జింగ్‌కు, ఇయర్, హెడ్‌ఫోన్స్‌కు కనెక్ట్ కావడానికి ఇప్పటికే కొన్ని మోడల్స్‌లోవున్న లైటనింగ్ కనెక్టర్ వ్యవస్థనే ఉపయోగిస్తారు. ఈ లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా ఇయర్ లేదా హెడ్‌ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

30 పిన్స్ ఉండే 3.5 జాక్‌ను ఉపయోగిస్తుండడం వల్ల ఐఫోన్ 6ఎస్ సిరీస్‌ను 7.1 మిల్లీమీటర్లకన్నా తక్కువ మందానికి తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఆ స్థానంలో 8 పిన్స్‌తో పనిచేసే లైటనింగ్ కనెక్టర్‌ను తీసుకరావడం వల్ల ఫోన్ మందం కూడా 1 ఎంఎం తగ్గుతుంది. ఈ కొత్త సిరీస్‌లో ఉండే మరో ఆకర్షనీయమైన ఫీచర్ ఏమిటంటే….నాయిస్ కన్సీలింగ్ (అనవసర శబ్దాలను నియంత్రించే) టెక్నాలజీని ఉపయోగించాలనుకోవడం.

నాయిస్ కన్సీలింగ్ వ్యవస్థ ఫోన్ అంతర్భాగంలోనే ఉండడం వల్ల ఫోన్‌లోని స్పీకర్ల గుండా కూడా స్పష్టమైన వాయిస్‌ను వినవచ్చు. లైటనింగ్ కనెక్టర్ ద్వారా కూడా ఇయర్ లేదా హెడ్ ఫోన్లలో మరింత స్పష్టంగా వాయిస్ వినిపిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాత ఐఫోన్లకు కూడా ఉపయోగపడేలా కొత్త ఐఫోన్లతోపాటు అడాప్టర్లను అందజేస్తారని సమాచారం. అయితే ఈ సరికొత్త ఫీచర్లు కలిగిన ఐఫోన్ 7 సిరీస్ ఎప్పుడు మార్కెట్‌లోకి వచ్చేది కంపెనీ వర్గాలు ఇంకా వెల్లడించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iphone7  Iphones  Apple phones  Iphone7  

Other Articles