Play Holi and get marriage

Play holi and get marriage

Holi, Telanagana, Marriage, Holi in Mahabubnagar

In Telangana State, Mahabubnagar Dist Village hamlet had a unique tradition. There villagers get marriage if they play holi otherwise it will not possible

హోళీ ఆడితేనే పెళ్లి

Posted: 03/24/2016 03:02 PM IST
Play holi and get marriage

హోళీ అంటే అందరూ సంతోషం కోసం ఆడతారు. కానీ ఓ చోట మాత్రం హోళీ ఆడటం తప్పనిసరి. ఒకవేళ హోళీ ఆడలేదనుకోండి.. వారికి పెళ్లిళ్లు కావు అని అర్థం. అవును హోళీ ఆడకపోతే పెళ్లి కాకపోవడం ఏంటా అనుకుంటున్నారా..? ఇది అక్షరాల నిజం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ తండాలో ఉన్న వింత ఆచారం ఇది. పండుగకు ముందు రోజు రాత్రి తండాలో పెళ్లీడుకొచ్చిన మగపిల్లల జుట్టు కత్తిరిస్తారు. ఈ హోలీ వేడుకలను 20 నుండి 25 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కాబట్టి ఏడాది వయసున్న మగ పిల్లలకు కూడా జుట్టు కత్తిరిస్తారు. ఇలా చేస్తే వారు పెళ్లికి అర్హులన్నట్లు. ఈ సందర్భంగా బంధువులు యువ కులకు కొత్త బట్టలు, ఆభరణాలు అందజేస్తారు.

ఆ తరువాత మహిళలు కొంతమంది ఓ చోట పొయ్యిలు పెట్టి బూరెలు చేసి బాణలిలో వేయి స్తుంటారు. ఇలా వేయించిన బూరెలను పెళ్లీడుకొచ్చిన మగ పిల్లలు ఎత్తు కెళ్లడానికి ప్రయత్నిస్తుంటే వాటిని తీసుకోనివ్వకుండా కొందరు మహిళలు జిల్లేడు కట్టెలతో కొడుతూ ఉంటారు. ఈ విధంగా మహిళలు ఎంత కొట్టినా వారి దెబ్బలను భరిస్తూ యువకులు బూరెలను ఎత్తుకెళ్తారు. వేడుకలో ఇది ఒక తంతు. ఆ తరువాత తండాలో రాత్రికి ఎర్రటి జెండాలు పట్టుకుని ఊరేగింపు నిర్వహిస్తారు. అర్దరాత్రి సమయంలో కాముడిని దహనం చేస్తారు.

తర్వాత తెల్లవారుజామున ఓచోట బహరంగ ప్రదేశంలో ఇరువైపులా రెండు కర్రలు పాతి వాటికి తాళ్లను కట్టి అవే తాళ్లను పెళ్లీడు కొచ్చిన యువకుల నడుముకు కడుతారు. వారికి కొద్ది దూరంలో రెండు ఇత్తడి బిందెలలో పాయసం వండి వాటిని భూమిలో పాతుతారు. యువకులు తాళ్లను తెంచుకుని బిందెలలో ఉన్న పాయసాన్ని ఎత్తుకెళ్లి తినాలి. అలా తాళ్లను తెంచుకుని బిందెలలో ఉన్న పాయసాన్ని తీసుకెళ్లే వరకు అక్కడున్న పెళ్లికాని యువతులు జిల్లేడు బరుగులతో యువకులను కొడుతూనే ఉంటారు. ఈ తతంగం సుమారు గంటకుపైగా జరుగుతుంది. తాళ్లను తెంచుకుని బిందెలలో ఉన్న పాయసాన్ని ఎత్తుకెళ్లి తిన్న తరువాత యువకులు, యువతులు, చిన్నా పెద్దా అంతా కలిసి ఉత్సాహంగా రంగులు చల్లుకుని హోలీని జరుపుకుంటారు. మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తారు. ఆ తరువాత తండావారితో పాటు వేడుకలకు పిలిచిన బంధువులు అందరు కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Holi  Telanagana  Marriage  Holi in Mahabubnagar  

Other Articles