Slipper Attack on Kanhaiya Kumar

Slipper attack on kanhaiya kumar

Kanhaiah Kumar, JNU, STudent, Slipper on Kanhaiah kumar

A student tries to hurl slipper at Kanhaiya Kumar in Hyderabad. Police arrested those ABVp, GoSamraksha smithi leaders at Hyderabad.

ITEMVIDEOS: కన్హయ కుమార్ పైకి చెప్పు విసిరిన ఆందోళనకారులు

Posted: 03/24/2016 01:32 PM IST
Slipper attack on kanhaiya kumar

హైదరాబాద్ లో జెఎన్. యు విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్ మీద చెప్పు విసిరారు గోసంరక్షణ సమితి నాయకులు. అంతకు ముందు ఏబీవీపీ, గోసంరక్షణ సమితి నాయకులు కన్హయ కుమార్ ప్రసంగించనున్న సభా స్థలంలోకి చొచ్చుకురావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టు చేశారు. అనంతరం కన్హయ్య మాట్లాడుతూ తొలుత హెచ్‌ సీ యూ లో ఘటన జరిగిందని, తర్వాత జేఎన్‌ యూలో విద్యార్థులను తప్పుపట్టారని అన్నాడు. పోనీ ఈ రెండింటినీ పక్కన పెడితే అలీగఢ్‌ యూనివర్సిటీ మైనారిటీ హోదాను తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు. మొత్తంగా అసలు విద్యార్థుల ఆందోళనను డీలెజిటమేట్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోందని ఆరోపించాడు. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఆందోళనను ఢిల్లీలో కొనసాగించాలని తాము ముందుగానే నిర్ణయించుకున్నామని, ఇక్కడ ఘటన జరిగిన తర్వాత తాను ఇక్కడికొచ్చి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడానని తెలిపాడు.

తాను హెచ్‌ సీ యూకు రావాలని ముందుగానే నిర్ణయించుకున్నామని, కానీ అనుకోకుండా జరిగిందో.. కావాలనే చేశారో గానీ తాను రావడానికి ఒక్కరోజు ముందే అప్పారావు మళ్లీ వీసీగా బాధ్యతలు స్వీకరించారని కన్హయ్యకుమార్ అన్నాడు. ఆయన మద్దతుదారులు దండలతో ఆయనకు స్వాగతం పలికారని, తర్వాత శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టడంతో హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపాడు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందని, హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోనని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలను మగ పోలీసులతో కొట్టించారని, విద్యుత్, వై-ఫై కట్ చేశారని, చివరకు అధ్యాపకులను కూడా కొట్టి, అరెస్టుచేసి జైళ్లలో పెట్టారని చెప్పాడు. పోలీసులు తొలుత తనను యూనివర్సిటీలోకి అనుమతించాలనే అనుకున్నారట గానీ.. తర్వాత అంతర్గత భద్రతా సమస్యల వల్ల పంపలేదని చెప్పారని.. ఆ అంతర్గత భద్రతను భంగపరిచింది ఎవరని ప్రశ్నించాడు. జేఎన్‌యూ - హెచ్‌ సీ యూలలో ఒకేలాంటి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanhaiah Kumar  JNU  STudent  Slipper on Kanhaiah kumar  

Other Articles