Flying snake spotted in Tamil Nadu

Flying snake spotted in tamil nadu

Flying snakes, Snakes, Tamilnadu, Forest

A rare three-foot long ‘flying’ snake have been spotted in a village on the city outskirts.Venkatesan, a farmer, noticed the snake flying from tree-to-tree to catch its prey in his farm at Kalampalayam last Saturday. He sought the help of a snake catcher who with his team managed to catch the reptile after a three-hour operation.

ఎగిరే పాములు.. మన దగ్గరే

Posted: 03/23/2016 01:32 PM IST
Flying snake spotted in tamil nadu

పాములను తలుచుకుంటే చాలా మందికి కలలో కూడా భయమే. మరి అదే పాములు గాలిలో కూడా ఎగురుతాయి..అవి మన దగ్గరే ఉన్నాయి అని తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా. కానీ నిజం మన దగ్గరే ఎగిరే పాములున్నాయి. అయితే ఆ పాములు విషపూరితమైనవి కాదు అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ రకమైన పాములు ఎక్కడ ఉణ్నాయని అనుకుంటున్నారా..? మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో వీటిని పరిశోధకులు గుర్తించారు.

తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో కాలంపలయం గ్రామానికి చెందిన వెంకటేశన్ అనే రైతు తన పొలంలో పని చేస్తుండగా, ఓ చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు ఆహారం కోసం గాల్లో ఎగురుతున్న పామును చూశాడు. వెంటనే అతను స్థానికంగా ఉండే పాములు పట్టేవాళ్లకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి ఎగిరే పామును పట్టుకున్నారు. ఆ పామును ఫారెస్టు అధికారులకు అప్పగించారు. వారు దానిని పరిశీలించి అరుదైన క్రిసోపీలియా రకానికి చెందిన పాముగా గుర్తించారు. ఆగ్నేయ దేశాలైన వియత్నాం, కంబోడియాలలో ఈ రకమైన పాములు ఉంటాయని వారు వెల్లడించారు. బూడిద వర్ణంలో ఉండి, నల్లటి మచ్చలతో కూడిన ఈ పాము గాల్లో ఒకేసారి 20ఫీట్ల దూరం వరకు ఎగురుతుందని చెప్పారు. ఫారెస్టు అధికారులు దానిని పుతుపతి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Flying snakes  Snakes  Tamilnadu  Forest  

Other Articles