Diya Mirza contraversial statements on Holi

Diya mirza contraversial statements on holi

Holi, Diya Mirza, Diya Mirza contraversial statements

Bollywood actress Dia Mirza has opened up about her controversial tweet that faced outrage from a lot of users on Twitter. Apologizing for her tweet, Dia said she did not have any intention to hurt any community and she just called for water conservation

హోళీ మీద దియామీర్జా వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 03/23/2016 01:48 PM IST
Diya mirza contraversial statements on holi

హోళీ.. దేశవ్యాప్తంగా ఎంతో రంగరంగ వైభవంగా సాగుతుంటే ఓ బాలీవుడ్ భామ మాత్రం దీని మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నన్ను హిందు వ్యతిరేకి అని అన్నా పర్లేదు అని మొదట ట్వీట్ చేసి తర్వాత మాత్రం క్షమాపణలు చెప్పింది. "కరువుతో ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రజలు హోలీ ఆట కోసం నీటిని వృధా చేస్తున్నారు. ముందుకు వెళ్దాం పదండి. యాంటీ-హిందూగా పిలవండి" అని గత బుధవారం హిందీ కథానాయిక దియా మిర్జా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అంతర్జాలంలో పెద్ద దుమారమే సృష్టించింది. పలువురు దియాపై విరుచుకుపడ్డారు.


దాంతో దియా మీర్జా దీని మీద వివరణ ఇచ్చింది. "నాకు అన్ని మతాలు, ఆచారాలు, పండుగల మీద విశ్వాసం ఉంది. ఓ వర్గం మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేద"ని చెప్పింది. నీటి కొరత కారణంగా మహారాష్ట్రలో రైతులు ఎంత తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారో.. దియా వివరించింది. "నీటి సంరక్షణ అనేది మన తక్షణ కర్తవ్యం. అందరికీ నా విన్నపం ఏంటంటే.. ఆచారాలను గౌరవిస్తూ.. డ్రై హోలీ జరుపుకుందామ"ని దియా మిర్జా కోరింది. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Holi  Diya Mirza  Diya Mirza contraversial statements  

Other Articles