National-level kabaddi player brutally shot down in Haryana

National level kabaddi player brutally shot down in haryana

Haryana, Murder, National-level kabaddi player murder

Sukhvinder Narwhal, a national-level kabaddi player, was murdered in broad daylight in Rohtak district of Haryana by two unidentified men who came on a scooter and pumped bullets into him and the entire incident, which happened on Tuesday, has been caught on a CCTV installed near the player's residence.

ITEMVIDEOS: హర్యానాలో పట్టపగలు ఆటగాడి హత్య

Posted: 03/17/2016 08:10 AM IST
National level kabaddi player brutally shot down in haryana

హర్యానాలోని రోహతక్ జిల్లాలో ఒక జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడిని ఇద్దరు దుండగులు పట్టపగలు హత్య చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఆ ఘటన మొత్తం ఆ సమీపంలోని ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. సుఖ్విందర్‌సింగ్ నర్వాల్  అనే కబడ్డీ ఆటగాడు ప్రాక్టీస్ అనంతరం ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఇంటికి నడిచి వెళుతుండగా, ఎదురుగా స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతనిపై తుపాకీతో రెండురౌండ్లు కాల్పులు జరిపారు. అతను కిందపడిపోయాక దగ్గరికి వచ్చి అతని తలకు గురిపెట్టి మరోసారి కాల్చి అక్కడి నుంచి పారిపోయారు.

సుఖ్విందర్‌ను తరువాత కొందరు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే అతని ప్రాణంపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా దగ్గరలోని ఓ ఇంట్లో ఉన్న సిసిటివి పుటేజ్ లలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు హల్ చల్ చేశాయి. కాగా దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. సిసిటివి పుటేజీల్లో దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా జాతీయ స్థాయి ఆటగాడిని ఇలా దారుణంగా హతమార్చడం పెద్ద చర్చకు తెర తీసింది. ఎందుకు అతడిని చంపాల్సి వచ్చిందో పోలీసులు ఛేదించాల్సిన అవసరం ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haryana  Murder  National-level kabaddi player murder  

Other Articles