Recording Dances at Annavaram Temple

Recording dances at annavaram temple

Annavaram, Annavaram Stayanarayana Swamy, recording Dances, EO, Marriage party at Annavaram

Recording dance, famous in Coastal Andhra, was recorded at Annavaram Satyanarayanaswamy temple in East Godavari district on Friday. The occasion was a marriage that was performed in the temple premises, where the marraige party arranged for the recording dance for the entertainment of their guests.

ITEMVIDEOS: అన్నవరం దేవాలయం వద్ద రికార్డింగ్ డ్యాన్సు

Posted: 03/12/2016 12:45 PM IST
Recording dances at annavaram temple

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్న అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో అపచారం చోటుచేసుకుంది. అయితే అపచారం అనుకోకుండా జరిగింది కాదు. కావాలనే చేసింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అన్నవరం కొండపై రికార్డింగ్ వెయ్యడం కలకలం రేపింది. పెళ్లి బృందం చేసిన హడావిడి అంతా వీడియో రూపంలో మీడియా ముందుకు రావడంతో అసలు అపచారం ఎక్కడ జరిగిందో వెలుగులోకి వచ్చింది. అన్నవరం దేవాలయంలోని హరిహరసదన్ వద్ద జరుగుతున్న ఓ వివాహవేడుకల్లో కొంతమంది మహిళా డ్యాన్సర్స్ రికార్డింగ్ డ్యాన్సులు చేశారు.

నిన్న రాత్రి హరిహరసదన్ వద్ద ఓ వివాహం జరిగింది. వివాహవేడుకల్లో భాగంగా ఈ అశ్లీల నృత్యాలు జరిగాయి. ఆ వివాహానికి హాజరైన స్థానిక టీడీపీ సర్పంచ్ హరిబాబు, మండల ప్రెసిడెంట్ తదితర నాయకులు కూడా ఆ డ్యాన్సుల్లో మునిగిపోయారు. అయితే ఈ వ్యవహారంపై ఆలయ ఈవో మాట్లడుతూ అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, తెల్లవారుజామున 3 గంటలకు జరగడంతో నృత్యాల విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి ఘటనపై విచారణ జరుపుతామన్నారు. కాగా స్వామి వారి చెంత ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏంటని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles