Marital rape recognized world over, why not in india..? rekha sharma

Rape is rape whether by husband or stranger

Rekha Sharma, Rape, husband, marital rape, criminalisation, National Commission for Women (NCW), husband, stranger, government response, Parliament, animal sacrifices

Advocating criminalisation of marital rape, National Commission for Women (NCW) member Rekha Sharma said that rape must be recognised as a crime whether by husband or a stranger.

భర్త బలవంతం చేసినా.. అత్యాచారం కింద శిక్ష వేయాల్సిందే..

Posted: 03/12/2016 12:00 PM IST
Rape is rape whether by husband or stranger

భర్త కానీ ఇతరులు కానీ ఎవరు అత్యాచారం చేసినా నేరంగా పరిగణించాలని జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలు రేఖా శర్మ డిమాండ్ చేశారు. భారతీయుల సంస్కృతి సంప్రదాయాల నేపథ్యంలో భార్యాభర్తల సంబంధాలను అత్యాచారంగా పరిగణించడం సరికాదని పార్లమెంట్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ పేర్కొనడంపై ఆమె స్పందించారు. మత విశ్వాసాల పేరిట భర్తలతో భార్యలు చిత్రహింసలు పడటాన్ని సహించలేమని రేఖా శర్మ అన్నారు.

జంతువుల పరిరక్షణకు జంతుబలులకు వ్యతిరేకంగా కూడా చట్టాలు తీసుకోచ్చామని, ఈ నేపథ్యంలో మహిళ సంరక్షణకు చట్టాలను ఎందుకు తీసుకురాలేమన్నారు. గుర్తు తెలియని అగంతకులే కాదు ఎవరు అత్యాచారం చేసినా అత్యాచారమే. భర్త అయినా మరొకరయినా అత్యాచారం కింద ఒకే శిక్ష వేయాలి' అని రేఖా శర్మ ట్వీట్ చేశారు. భారతీయుల విషయంలో భార్యాభర్తల మధ్య అత్యాచార ఘటనగా పరిగణించలేమని రాజ్యసభలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ చెప్పడం సమంజసం కాదన్నారు.

పార్లమెంటులో ముందుగా మహిళల సంరక్షణకు చట్టాలను తీసుకువస్తే.. ఈ మేరకు అవగాహన లేని వారు కూడా క్రమంగా అలవాటు పడితారని అమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో రానున్న రోజుల్లో భర్తలతో పాటు మగ మృగాళ్ల చేతుల్లోంచి మహిళలు తమను తాము రక్షించుకోగలుగుతారని అమె అన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా వివాహ సంబంధిత అత్యాచార ఘటనలను నేరంగా పరిగణిస్తున్నారని, వ్యతిరేకంగా చట్టాలున్నాయని, మన దేశంలో ప్రత్యేకత ఎందుకని రేఖా శర్మ ప్రశ్నించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rekha Sharma  Rape  husband  marital rape  criminalisation  NCW  stranger  government response  animal sacrifices  

Other Articles