Captain Vijaykanth may CM Candidate in the Tamilnadu elections

Captain vijaykanth may cm candidate in the tamilnadu elections

Tamilnadu, Vijaykanth, DMK, AIADMK, Captain Vijaykanth, Javadekar, BJP

Actor-turned-politician, Captain Vijayakanth is an interesting character in Tamil Nadu politics. Although he doesn’t boast of the long political history of the Dravidian giants, the DMK and the AIADMK, his DMDK is the third most important party in the state. Justifiably he is the most sought after ally among the opposition parties.

తమిళనాడు సిఎం అభ్యర్థిగా కెప్లెన్ విజయ్ కాంత్!

Posted: 03/10/2016 09:02 AM IST
Captain vijaykanth may cm candidate in the tamilnadu elections

డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ‘ఆఖరి అస్త్రం’ కూడా ప్రయోగించింది. విజయ్ కాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కేంద్రమంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జావడేకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీలో తీవ్ర అసంతృప్తి చెలరేగడంతో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం కీలకంగా మారిన విజయ్ కాంత్ కింగ్ మేకర్ గా మారిన నేపద్యంలో అన్ని పార్టీలు దృష్టి కెప్లెన్ విజయ్ కాంత్ ను తమ వైపుకు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి.

తమతో కనీసం సంప్రదింపులు జరపకుండా జవదేకర్ ఎలా ప్రకటిస్తారన్న సందిగ్దంలో పడ్డారు తమిళ బిజెపి నాయకులు. చివరకు ఢిల్లీకి వ్యవహారం చేరడంతో అవన్నీ తమిళ మీడియా సృష్టిగా తేలాయి. రాజ్య సభలో జవదేకర్ ఉన్నారని, అలాంటప్పుడు ఆయన మీడియాతో ఎలా మాట్లాడటం జరిగిందంటూ ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడింది. అలాగే, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పందిస్తూ, తమతో సంప్రదింపులు జరపకుండా జవదేకర్ ఎలా ప్రకటిస్తారని, పొత్తు ,సీట్ల పందేరాల వ్యవహారాల్లో తమ ప్రమేయం కూడా ఉంటుందన్న విషయాన్ని మీడియా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన చురకలు అంటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  Vijaykanth  DMK  AIADMK  Captain Vijaykanth  Javadekar  BJP  

Other Articles