బీజేపి నేతల, మంత్రులు తృటిలో ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నా.. వారి చుట్టూ వివాదాలు మాత్రం రాజుకుంటున్నాయి. ఇటీవల బీజేపి ఎంపీ హేమామాలిని ప్రమాదం బారిన పడిన తరువాత.. అమె కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మొదట అమె కూతుళ్లు ఒకలా, ఆ తరువాత అమె కోలుకున్న తరువాత స్వయంగా మీడియాతో మాట్లాడిన హేమామాలిని మరోలా స్పందించడంపై నెట్ జనులు తీవ్రంగా స్పందించారు.
సరిగ్గా అదే మాదిరిగా తాజాగా యమునా ఎక్స్ ప్రెస్వేపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కన్వాయే కారణమని బాధితులు ఆరోపించారు. ఈ దుర్ఘటనలో ఆగ్రాకు చెందిన వైద్యుడొకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. స్మృతి ఇరానీ కాన్వాయ్ కారు రెండు పర్యాయాలు తమ కారును ఢీ కోనడంతోనే వైద్యుడు మరణించాడని, లేని పక్షంలో ఆయన బతికేవారని మృతుడి కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు.
మరోవైపు ప్రమాదం జరిగిన తరువాత తన కాన్వాయ్ నుంచి దిగిన మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఘటనను చూసి తన వాహనాన్ని ఎక్కి వెళ్లిపోయిందని, అమెను తన తండ్రిని బతికించమని, ఆప్పత్రికి తరలించేందుకు సహాయపడమని చేతులు జోడించి అర్థించినా.. పెడచెవిన పెట్టి అమానవీయంగా వ్యవహరించారని మృతుడి కుమార్తె ఆరోపించారు. అమె మీడియాతో మాట్లాడుతూ.. 'స్మృతి ఇరానీ కాన్వాయ్ లోని వాహనం మా కారును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి ఇరానీ బయటకు వచ్చారు. సహాయం చేయమని చేతులు జోడించి వేడుకున్నాను. కానీ ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయార'ని మృతుడి కుమార్తె అవేదన వ్యక్తం చేసింది.
తన సోదరి ఎంతగా బతిమాలినా మంత్రి మనసు కరగలేదని మృతుడి కుమారుడు వాపోయాడు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రమాద బాధితులకు వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, చికిత్స అందించాలని స్థానిక అధికారులను స్మృతి ఇరానీ ఆదేశించారని వెల్లడించింది. ప్రమాదానికి ఇరానీ కాన్వాయ్ కారణం కాదని పేర్కొంది. ఇదిలావుండగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కూడా మంత్రి కాన్వాయ్ కు, ప్రమాదానికి కారణం లేదని తేల్చిచెప్పారు. అయితే ఈ ప్రమాదంపై న్యాయస్థానం సుమోటోగా కేనును విచారించనుంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more