Delhi Police questions Adarsh Sharma over posters awarding money to kill Kanhaiya

Man who offered rs 11 lakh to shoot kanhaiya has rs 150 in bank

kanhaiya kumar, adarsh sharma, killing kanhaiya, Adarsh Sharma over posters, Adarsh Sharma posters to kill Kanhaiya, Purvanchal Sena, anti-national, sedition, jnu, jnu row

The posters carried the mobile number and name of Adarsh Sharma, president of one Purvanchal Sena.

పోలీసుల అదుపులో అదర్శ్ శర్మ.. బ్యాంక్ అకౌంట్ చూసి షాక్..

Posted: 03/07/2016 05:50 PM IST
Man who offered rs 11 lakh to shoot kanhaiya has rs 150 in bank

జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఇందుకు కేంద్ర మంత్రులతో పాటు విపక్ష సభ్య నేతలు, బీజేపి సహా ప్రతిపక్ష ఎంపీలు, నేతలు కూడడా కారణమే. దీంతో ఒక్కసారిగా ఆయనకు జాతీయ మీడియా ప్రాధాన్యతనిచ్చింది. ఈ విషయాన్ని పక్కన బెడతే.. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు పీహెచ్డీ స్కాలర్ కన్హయ్య కుమార్ను హత్య చేయాలని, ఎవరైనా అలా చేస్తే వారికి రూ.11 లక్షలు చెల్లిస్తానంటూ ఆఫర్ చేశాడు పూర్వంచల్ నేత ఆదర్శ శర్మ.

అయితే ఈ ప్రకటన వెలువడగానే సదరు నేత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి దాకున్నారు. ఆయనను అరెస్టు చేయాలని స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లారు. ఎలాగోలా పోలీసులు అతడ్ని పట్టుకుని అరెస్టు చేసి.. కన్హయ్యను చంపేందుకు వాడిన పోస్టర్లు, ఎవరి ప్రేరణతో ముద్రించారని ఆరా తీస్తున్నారు. కాగా అతని ప్రకటన నేపథ్యంలో తన బ్యాంకు ఖాతాలో ఎంత సోమ్ము వుందన్న వివరాలను తెలుసుకన్న పోలీసులు షాక్ తిన్నారు.

ఆదర్శ శర్మ బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.150మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా అతడు కొద్ది నెలలుగా అతడు ఉంటున్న గదికి అద్దె కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. బిహార్లోని బెగుసారాయ్కు చెందిన ఆదర్శ శర్మ ది పుర్వాంచల్ సేనకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. రోహిణీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకున్నారు. పోలీసులు అతడిపై కేసు నమోదుచేయగానే.. చీకట్లోకి వెళ్లిపోయిన ఆదర్శ శర్మ.. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకోవడమే కాకుండా దాదాపు అన్ని కమ్యూనికేషన్స్ కట్ చేసుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adarsh Sharma  Rs 11 lakh  JNUSU  Kanhaiya Kumar  

Other Articles