Karbonn offers affordable smartphones for women

Karbonn offers affordable smartphones for women

Domestic handset maker, Karbonn Mobiles, Karbonn Mobiles offer for women,Women's day offer, Karbonn Mobiles discount for women, Karbonn Quattro L50 HD, Karbonn Titanium Moghul, Karbonn Titanium Mach Five, Karbonn K9 Smart, Karbonn Kandy UI, Karbonn Titanium Moghul

Domestic handset maker Karbonn Mobiles said it is offering a series of affordable smartphones to women on the occasion of International Women's Day on Tuesday.

మహిళలకు మాత్రమే.. కార్భన్ మొబైల్ ఉమెన్స్ డే ఆఫర్..

Posted: 03/07/2016 07:18 PM IST
Karbonn offers affordable smartphones for women

ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ కార్బన్.. మగువలకు శుభవార్తను అందించింది. ప్రపంచ మహిళఆ దినోత్సవం రోజున మగువలు తమ కార్బన్ మొబైల్స్ కోంటే వారికి ఆఫర్ ప్రకటించింది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను మంగళవారం వనితలకు తక్కువ ధరలకు అందిస్తున్నట్టు తెలిపింది. క్వాట్రో ఎల్ 50 హెచ్ డీ రూ.7999, టిటానియం మాచ్ ఫైవ్ రూ. 5999, టిటానియం మొఘల్ రూ.5790, కే9 స్మార్ట్ ఫోన్ ను రూ.3999లకు విక్రయించనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇటీవలే విడుదల చేసిన క్వాట్రో ఎల్ 50 హెచ్ డీ స్మార్ట్ ఫోన్ తో వినియోగదారులకు స్థిరమైన, సురిక్షిత 4జీ అనుభవం సొంతమవుతుందని తెలిపింది. 127 సెంటీమీటర్ల హెచ్ డీ ఐపీఎస్ ఫుల్ లామినేషన్ స్క్రీన్, 1.3 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఆన్-బోర్డ్ మెమొరీ, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాఫిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా, 5 మెగాఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయని కార్బన్ మొబైల్స్ సంస్థ వెల్లడించింది. కాగా కేవలం మహిళా దినోత్సవం రోజునే ఆఫర్ ను వర్తింపజేస్తున్నామని, దీనిని మహిళలందరూ వినియోగించుకోవాలని కోరింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karbonn Mobiles  offers  Karbonn Quattro L50 HD  Women's day offer  

Other Articles