Modi like sky others are passing clouds

Modi like sky others are passing clouds

Modi, BJP, Kanaiah Kumar, JNU, JNU Row, Kejriwal, Hardik Patel, Narendra Modi, PM Modi, Media, BJYM, BJP Party, Bharathiya Janata Party

Kejriwal, Hardik Patel and Kanaiah kumar are passing clouds behind the Modi sky.

మోదీ ఆకాశంఐతే.. వాళ్లు మేఘాలు

Posted: 03/05/2016 04:06 PM IST
Modi like sky others are passing clouds

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పేరు బిజెపి ప్రతిపాదించినప్పటి నుండి దేశంలో కొన్ని కాలం చెల్లిన రాజకీయ శక్తులు మోదీ చరిష్మాను దెబ్బతియ్యడానికి నానా ప్రతయ్నాలు చేసి.. తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డాయి. ఛాయ్ వాలా ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు లేవని.. కావాలంటే తమ పార్టీ ఆఫీసు దగ్గర టీ అమ్ముకోవడానికి అవకాశమిస్తామని అవహేళన చేశారు. కానీ భారత ప్రజలు మాత్రం ఏకపక్షంగా మోదీకి ఓటు వేసి.. పూర్తి మెజార్టీతో.. చరిత్రలో ఎన్నడూలేనంత అంగరంగ వైభవంగా మోదీకి ప్రధాని పదవిని కట్టబెట్టారు. ఇక మోదీ ప్రధాని పీఠాన్ని అధిరోహించగానే వ్యతిరేకంగా పని చేస్తున్న అన్ని రాజకీయ శక్తులు ఏకమయ్యాయి. అయితే మోదీ మీద రకరకాలుగా కొన్ని మీడియా ఛానల్స్ కూడా మోదీ వ్యతిరేక శక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి.

నిజానికి మోదీ హవా ముందు ఎవరూ నిలవలేక చేతులెత్తేశారు. మోదీకి ఊహించినదానికంటే అధిక రెట్ల మెజార్టీ రావడంతో ప్రతిపక్ష పార్టీలు బెంబేలెత్తిపోయాయి. తమ పరిస్థితి ఏంటో అర్థంకాని తరుణంలో అన్ని మోదీ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయి. అలా ఏకమైన శక్తులు... ముందు నుండి ఉన్న ఆర్ఎస్ఎస్ హిందుత్వ ముద్రను బూచిగా చూపిస్తూ.. కాలాన్ని వెల్లదీయాలని ప్లాన్ వేశారు. అయితే మోదీకి ఎక్కడ చిన్న గాలి వీచినా కానీ దాన్ని పెద్ద తుఫానుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించిన చందంగా.. వీళ్లకు మోదీ తుమ్మినా. ఆఖరుకు దగ్గినా కూడా తప్పుగానే కనిపిస్తోంది.

జాతీయ మీడియా ఎలా మోదీ ప్రభుత్వం మీద కసికట్టిందో చూస్తే అసలు రాజకీయం ఏంటో అర్థమవుతుంది. 2014లో దిల్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ను మీడియా ఏరకంగా హైలెట్ చేసిందో అందరూ చూశారు. దేశంలో మోదీ హవాకు బ్రేక్ పడింది.. మోదీ హవా తగ్గింది.. మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అంటూ ప్రభుత్వం మీద విశ్వాసం తగ్గించేందుకు అన్ని మీడియా ఛానల్స్ చాలా నిజాయితీగా పని చేశాయి. కేజ్రీవాల్ కూడా వాపును బలుపు అనుకున్నారు.. కానీ తర్వాత వంద రోజులు కూడా ప్రభుత్వాన్ని నడిపించలేక. చేతులెత్తి రాజీనామా బాటపట్టారు. అయితే వంద రోజులు కూడా పరిపాలించడం చేతగాని కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని మోదీకి ప్రత్యర్థిగా చాలా మంది అభివర్ణించారు. కానీ మోదీ చరిష్మాకు ఏమాత్రం సరితూగని కేజ్రీవాల్ ను హైలెట్ చెయ్యడం వెనక రాజకీయం ఎంతలా నడిచిందో అర్థమవుతుంది.

ఇక మోదీ ముందు ఇంట గెలిచి.. రచ్చ గెలిచారు కాబట్టే దాన్నే టార్గెట్ గా చేశాయి రాజకీయ శక్తులు. అందుకే గుజరాత్ లో ఎవ్వరు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. ముందు సొంతం రాష్ట్రంలో హవాలేదు కానీ జాతీయంగా మాత్రం హవా ఉందా అని ప్రశ్నించాలనుకున్నారు. అలాంటి అవకాశం కోసం ఎదరుచూశారు. గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని పటేల్ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచింది. అయితే ఈ ఉద్యామినికి సారథ్యంవహించిన హార్దిక్ పాటిల్ ను మోదీకి ప్రత్యర్థిగా ప్రాచరం చేశారు. పట్టుమని కనీసం పాతికేళ్ల వయస్సు కూడా లేని హార్దిక్ పటేల్ ను మోదీకి వ్యతిరేకంగా పైకి ఎగదోసింది ఎవరు.? ఎలాంటి రాజకీయ అండదండలు లేకుండానే హార్దిక్ లాంటి మామూలు వ్యక్తి ఉద్రిక్తతల నడుమ పటేల్ ఉద్యమాన్ని నడిపించారా..? అన్నది ఆలోచించాలి. దీని వెనకాల ఎంత మీడియా మేనేజ్ మెంట్ ఉందో అర్థమవుతోంది. 2015 మొత్తం హార్దిక్ పటేల్ చుట్టూ వార్తలు నడిపించాయి మీడియా చానల్స్.

ఇక ఇప్పుడు 2016 వంతు. అందుకే మరో హీరో కోసం వెతుక్కుంటూ చివరకు దిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కన్హయ కుమార్ ను వార్తల్లో హైలెట్ గా చేశాయి,. అయితే పరిస్థితులు కూడా కన్హయ కుమార్ కు మీడియాలో ఎక్కువ కవరేజ్ కల్పించేలా చేశాయనుకోండి కానీ అంతకన్నా ముందు మీడియా మాత్రం కన్హయ కుమార్ ను మరింత హైలెట్ చేసింది అన్నది మాత్రం నిజం. ఇక మోదీ సర్కార్ మీద కన్హయ కుమార్ చేసిన వ్యాఖ్యలను కనీసం సెకను కూడా కట్ చెయ్యకుండా కొన్ని మీడియా ఛానల్స్ ప్రసారం చేశాయి. కన్హయ కుమార్ కోరుకేనే దేశంలోని స్వేచ్ఛ అందరికి అవసరమే. దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్న అదే. అందుకే ప్రభుత్వాలు కూడా ఆ దిశగా అడుగులు వేశాయి.

కానీ గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద రుద్దడం ఏమాత్రం మంచిది కాదు. మోదీ సర్కార్ వచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది. నిన్నటి దాకా అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను చక్కదిద్దడానికి రెండు బడ్జెట్ లు, రెండు సంవత్సరాల కాలం ఏ మాత్రం సరిపోదు. మోదీ సర్కార్ చేసిన ప్రతి పని భవిష్యత్ తరాల గురించి ఎంతో ఆలోచించి చేసిన పథకాలు. కానీ ఆకాశం లాంటి మోదీకి అప్పుడప్పుడు కేజ్రీవాల్ లాంటి మేఘాలు కమ్మి ఉండవచ్చు కానీ ఎన్నికలు అయిపోగానే ఆ మేఘాలు మాయమైపోతాయి. అలాగే హార్దిక్ పాటిల్ లాంటి మేఘాలు మోదీ చరిష్మాను ఆపాలనుకుంటే అవి కూడా కనిపించకుండాపోయాయి. ఇక ఇప్పుడు కన్హయ కుమార్ అనే మరో మేఘం వచ్చింది... మోదీ ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఓ విషయం మాత్రం మరిచిపోతున్నారు.. మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆకాశం మాత్రం స్థిరంగా ఉంటుందని గమనించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  BJP  Kanaiah Kumar  JNU  JNU Row  Kejriwal  Hardik Patel  Narendra Modi  PM Modi  Media  BJYM  BJP Party  Bharathiya Janata Party  

Other Articles