BJP youth wing leader announces prize for cutting off Kanhaiya Kumar's tongue

Bjp youth wing leader announces prize for cutting off kanhaiya kumar s tongue

Kanaiah kumar, JNU Row, JNU, BJP, Modi, BJYM, Five Lakh, Kanhaiya Kumar's tongue

BJYM Badaun district president Kuldeep Varshney has been expelled from the party for 6 years after he announced Rs 5 lakh prize money for cutting off the tongue of JNUSU president Kanhaiya Kumar.

కన్హయ నాలుక కోస్తే ఐదు లక్షల నజరాన

Posted: 03/05/2016 01:15 PM IST
Bjp youth wing leader announces prize for cutting off kanhaiya kumar s tongue

భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే ఈ సంచలన వ్యాఖ్యాలు చేశాడు. జెఎన్‌యూ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్హయ్య కూమర్‌ నాలు తెగ్గొస్తే...అయిదు లక్షలు బహుమతిగా ఇస్తానంటూ కలుదీప్‌ వార్ష్నే వ్యాఖ్యానించి తాజాగా వివాదానికి తెరలేపారు. అఫ్జల్ గురు లాంటి తీవ్రవాదికి మద్దతుగా జాతి వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కన్హయ్య కుమార్ నాలుకను ఎవరైనా కత్తిరించాలని కోరారు. అలా చేసిన వారికి 5 లక్షల రూపాయలను కానుకగా ఇస్తానని చెప్పారు. గురువారం జైలు నుంచి విడుదలైనప్పటినుంచి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అందుకే ఎవరైనా ఈ చర్యకు ఎవరైనా పాల్పడాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కాగా కన్హయా దేశద్రోహం ఆరోపణలపై ఫిబ్రవరి 12 న అరెస్టు చేయగా, ఢిల్లీ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈనెల 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు.తీహార్ జైలు నుండి విడుదలైన కన్హయ కుమార్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. తాను దేశం నుండి స్వాతంత్ర్యాన్ని కోరుకోవడం లేదని. దేశంలోనే స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. కాగా తాజాగా కన్హయ కుమార్ నాలుక కోస్తే ఐదు లక్షలు ప్రకటన వివాదానికి తెర తీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanaiah kumar  JNU Row  JNU  BJP  Modi  BJYM  Five Lakh  Kanhaiya Kumar's tongue  

Other Articles