Soul doing robbery

Soul doing robbery

Soul, Theft, Robbery, Madhapur, Hyderabad

In Hyderabad, Police identified that a soul thefting Gold and Money. They collect finger prints at the crime scene and they examined. They found that those finger prints matched with a man who died few years ago.

దొంగతనం చేస్తున్న ఆత్మ

Posted: 03/03/2016 11:40 AM IST
Soul doing robbery

అవును.. మీరు చదువుతన్నది అక్షరాల నిజం. ఆత్మ దొంగతనాలు చేస్తోంది.. అది కూడా బంగారం, డబ్బులు కొట్టేసి మరీ తప్పించుకుంటోంది. మాదాపూర్ లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దొంగతనం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. దొంగతనం చెయ్యడం అంటే మామూలుగా కాదు.. ఎంతో ప్రొఫెషనల్ గా కుక్కలకు మత్తు మందు ఇచ్చి.. డోర్ పక్కన ఉన్న కిటికీకి గ్రిల్ ద్వారా కన్నం కొట్టి లోపలున్న బంగారం, డబ్బులతో ఉడాయించింది ఆత్మ. అయితే దీని మీద విచారణకు దిగిన పోలీసులు... ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ ను పాత రికార్డులతో పోల్చగా.. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అయ్యాయి. అందుకే అందరూ ఆత్మ దొంగతనం చేసిందని ఫిక్సయ్యారు.

దొంగతనం జరిగిన ప్రదేశంలో ఫింగర్ ప్రింట్స్ ను కలెక్ట్ చేసిన పోలీసులు పాత రికార్డులను పరిశీలించారు. అలా చూస్తుండగా.. 1998లో నమోదైన దొంగతనం కేసులకు సంబంధించిన వేలిముద్రలతో పోల్చి చూశారు. అప్పుడు మాదాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఓ దోపిడీ కేసులోని ప్రధాన నిందితుడు సంతోష్‌కుమార్ షిండే వేలి ముద్రలతో సరిపోయాయి. అప్పటి నుంచి అల్వాల్ క్రైం పోలీసులు సంతోష్‌కుమార్ షిండేను పట్టుకోవడం కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో 2007లో సంతోష్‌కుమార్ షిండే మృతి చెందినట్టు షోలాపూర్ మున్సిపల్‌శాఖ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్‌ను అతని కుటుంబసభ్యులు మాదాపూర్ పోలీసులకు సమర్పించినట్టు గుర్తించిన అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన అల్వాల్ క్రైం పోలీసులకు అల్వాల్‌లోనే కాకుండా నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలల్లో ఇలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరికినట్లు తెలుసుకున్నారు. ఆ జిల్లాల పోలీసులు సంతోష్‌కుమార్ షిండే కోసం గాలిస్తుండగా సైబరాబాద్ పోలీసులు మాత్రం అతని డెత్‌సర్టిఫికెట్ ఉన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దాంతో పోలీసులకు చమటలు పడుతున్నాయి. డెత్ సర్టిఫికేట్ అబద్దమా లేదంటే ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ తప్పా..? అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soul  Theft  Robbery  Madhapur  Hyderabad  

Other Articles