Rahul tears into Modi, Government on Pakistan terrorism

Modi let pakistan off the hook rahul gandhi

Rahul Gandhi, Parliament, PM Modi, pakistan, Lok Sabha, Rahul Gandhi Speech on mumbai attack, rahul gandhi speech on black money, rahul gandhi on modi, rahul critiizes modi government, rahul fires on modi, rahul slams modi government, murali manohar joshi, lk advani, arun jaitley, sushma swaraj

Rahul Gandhi fired on all cylinders as he attacked Prime Minister Narendra Modi during a debate on the president's address in the Lok Sabha

కప్పు టీ కోసం.. దోషిని బోను నుంచి తప్పించిన మోడీ

Posted: 03/03/2016 11:50 AM IST
Modi let pakistan off the hook rahul gandhi

‘26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో దోషిగా బోనులో నిల్చున్న పాకిస్థాన్ ను కప్పు టీ కోసం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ దానిని తప్పించారిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో ఆయనపై ధ్వజమెత్తారు. దాడుల అనంతరం యూపీఏ ప్రభుత్వం ఆరేళ్లు కష్టపడి పాకిస్తాన్‌ను చిన్న బోనులో బంధించింది. ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని చేసింది. నిఘా వర్గాలు, దౌత్యవేత్తలు, విపక్ష నేతల సంప్రదింపులతో యూపీఏ ఆ ఘనత సాధించగలిగింది. కానీ ప్రధాని మోదీ ఏం చేశారు? లాహోర్‌లో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఒక కప్పు టీ కోసం పాక్‌ను ఆ బోను నుంచి విడిపించేశారు.  ఒక్క చేత్తో ఆరేళ్ల యూపీఏ కష్టాన్ని బూడిదపాలు చేశారు’ అని మండిపడ్డారు.

అటు కాశ్మీర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాం. స్వయంసహాయ బృందాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాం. మొత్తంగా ఆ రాష్ట్రంలో వేర్పాటువాదం వెన్ను విరిచాం. ఇప్పుడు ఆ కష్టాన్నంతా ఎలాంటి ముందు చూపు లేకుండా ప్రధాని నాశనం చేశారని కాంగ్రెస్ యువనేత మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రసంగిస్తూ.. మోదీ సర్కారుపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు, చణుకులు, చురకలతో ఆద్యంతం ప్రసంగాన్ని ఆసక్తికరంగా కొనసాగించారు.

‘కనీసం మీ మంత్రివర్గ సహచరులనైనా సంప్రదించండి’ అని వ్యంగ్యంగా సూచించారు.  కీలకాంశా ల్లో ప్రతిపక్షాన్ని సంప్రదించాలని సూచిస్తూ ‘విపక్షం మీకు శత్రువు కాదు. మిమ్మల్ని అసహ్యించుకోదు. దేశ ప్రయోజనాల కోసం మమ్మల్నీ సంప్రదించండి. మా మాటలనూ వినండి’ అని హితవు చెప్పారు. 2015లో నా గా వేర్పాటువాద సంస్థతో కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి హోంమంత్రి రాజ్‌నాథ్‌కు సైతం తెలియదన్నారు. ‘మోదీ లా హోర్ పర్యటన గురించి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలియకపోయిఉండొచ్చ’ న్నారు. ‘ప్రధాని ఒక్కడే దేశాన్ని నడపలేరు. దేశమంటే ప్రధాని ఒక్కరే కాదు’ అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Parliament  PM Modi  pakistan  Lok Sabha  

Other Articles