Kerala TV anchor receives two thousand threat calls

Kerala tv anchor receives two thousand threat calls

Kerala, Anchor, Mahishasura Mardhini, BJP, HIndu Leaders

After arresting five suspects, police in Kerala say that more arrests are likely on charges of abusing and threatening a leading woman anchor of a popular TV channel. The telephone of anchor Sindhu Suryakumar of Asianet TV has not stopped ringing since she anchored a discussion on Friday night on HRD Minister Smrithi Irani's comments on Mahishasura in parliament last week.

టీవీ యాంకర్ ను బెదిరిస్తూ 2వేల ఫోన్ కాల్స్

Posted: 03/02/2016 10:50 AM IST
Kerala tv anchor receives two thousand threat calls

ఒకటి కాదు.. రెండు రాదు.. ఏకంగా రెండు వేల బెదిరింపు కాల్స్ ను ఎదుర్కొంది ఓ టివీ యాంకర్. మహిషాసుర జయంతి జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించిన టీవీ యాంకర్‌ను తిడుతూ ఏకంగా 2వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటన కేరళలో జరిగింది. అక్కడ ఏషియానెట్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఎడిటర్, యాంకర్ అయిన సింధు సూర్యకుమార్ షో నిర్వహించారు. అప్పటి నుంచి ఆమెను తెగ తిట్టిపోస్తూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. షో సమయంలో హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా అభివర్ణించారని సింధుపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా జనం రెచ్చిపోయారు. ఆమె ఫేస్‌బుక్ పేజీలో తీవ్రవ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అందులో ఒకరు ఏకంగా సింధు మొబైల్ నెంబరు కూడా పోస్ట్ చేసి, ఆమెకు నేరుగా ఫోన్ చేసి తిట్టాలని చెప్పారు.
 
అప్పటి నుంచి ఆమెకు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. చివరకు విసిగిపోయిన సింధు.. పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమెకు ఫోన్లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వాళ్లంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామ సేన లాంటి సంస్థలకు చెందినవారని తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ తెలిపారు. అయితే.. దేవతను తిడుతూ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత వీవీ రాజేష్ ఓ కరపత్రంలో చదివారని, దాన్ని దేశద్రోహం అని ఎలా అంటారని మాత్రమే అడిగానని సింధు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. హిందూదేవతను సెక్స్‌వర్కర్‌గా చెప్పడంలో తప్పేంటని తాను అనలేదని ఖండించారు. పోలీసులు అలా ఫోన్ చేసిన చాలా మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Anchor  Mahishasura Mardhini  BJP  HIndu Leaders  

Other Articles