Woman Allegedly Gang-Raped In Moving Car In East Delhi

East delhi woman gang raped in a moving car

Delhi, Gangrape, Anand Vihar, Madhu Vihar, Gangrape in moving car, rape,East Delhi,Delhi,gang-rape,Woman, moving car, gang-rape, Anand Vihar, New Delhi, attrocities on women, harrassment on women, rape on women, gangrape on women

A middle-aged woman was allegedly gangraped by four men in a moving car late night on Friday when she went to buy food in east Delhi's Anand Vihar area. A case has been registered and the police are trying to verify the incident

దేశరాజధానిలో మళ్లీ అదే దారుణం.. కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్ రేప్

Posted: 02/28/2016 12:01 PM IST
East delhi woman gang raped in a moving car

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఢిల్లీలోని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నా.. అబలలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే వున్నాయి. నిర్భయ ఘటనను యావత్ దేశంలో పాటు బీజేపి కూడా ఖండించింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. అత్యాచారాలను నిరోధించడానికి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన బీజేపి నేతలు.. గత రెండేళ్లుగా మహిళలపై గ్యాంగ్ రేప్ లు, అత్యాచారాలు జరుగుతున్నా తదనంతర చర్యలు తీసుకోవడం మినహా ముందస్తు చర్యలు తీసుకుని వాటిని నిరోధించడంలో మాత్రం విఫలమవుతున్నారు.

ప్రభుత్వం నిర్లక్యాన్ని, అసమర్థతను, దీనికి తోడు పోలీసుల వున్న తీవ్రమైన పనిఒత్తిడిని అదనుగా చేసుకుని సాయంత్రంమైతే చాలు దేశరాజధాని వీధుల్లోకి తెగబడుతున్న పైశాచిక మృగాలు మహిళలను కిడ్నాప్ చేయడం, వారికి మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారాలకు తెగబడటం నిత్యకృత్యంగా మారిపోయింది. దేశ రాజధానిలో పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా.. మహిళలకు మాత్రం ఏవ్వరూ భద్రతను కల్పించలేకపోతున్నారు.

తాజాగా కదులుతున్న కారులో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు ఆనంద్ విహార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రాత్రి 10 గంటల ప్రాంతంతో ఆహార పదార్థాలు తెచ్చుకునేందుకు షాపింగ్ మాల్ కు వెళ్లిన బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకుని నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆమెపై దాడి చేశారు. తర్వాత ఆమెను మధు విహార్ లోని కడ్కీ మోడ్ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. నిందితులు వియోగించిన కారును గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : moving car  gang-rape  Anand Vihar  New Delhi  crime news  

Other Articles