Freedom 251: Call-centre alleges fraud by Ringing Bells; company denies charge

Freedom 251 faces more trouble helpline company to file fir for fraud

freedom 251, buy freedom 251, freedom 251 website crash, freedom 251 registrations,ringing bells fraud, Cyfuture, ringing bells fraud case, ringing bells freedom 251, ringing bells, freedom 251 mobile, freedom 251 booking, freedom 251 mobile booking, technology, technology news

Cyfuture claims that it is a vendor of Ringing Bells, and alleges that the smartphone company has not fulfilled payments due to them.

తాజా వివాదంలోకి ఫ్రీడమ్ 251 ఫోన్..

Posted: 02/26/2016 09:36 AM IST
Freedom 251 faces more trouble helpline company to file fir for fraud

అత్యంత చౌకగా స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటనతో యావత్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసిన ఫ్రీడమ్ 251 ఫోన్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ కంపనీ తాజగా కొత్త వివాదంలోకి చిక్కుకుంది. కేవలం రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని ప్రకటించి కొన్ని కోట్ల విలువైన పబ్లిసిటీని ఉచితంగా పొందిన రింగింగ్ బెల్స్ కంపెనీపై.. ‘సైఫ్యూచర్’ సంస్థ చీటింగ్ కేసు పెట్టే యోచనలో ఉంది. డేటా, బీపీవో సర్వీసులను అందిస్తున్న సంస్థ రింగింగ్ బెల్స్ సంస్థ ఉచితంగా ప్రచారం పోందిన నేపథ్యంలో సైఫ్యూచర్ సంస్థ చీటింగ్ కేసు పెట్టాలని యోచిస్తుంది.

రింగింగ్ బెల్స్ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు సంబంధించి భారత్‌లో కాల్ సెంటర్ సేవలను అందించడానికి సైఫ్యూచర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రింగింగ్ బెల్స్ కంపెనీ తమకు చెల్లించాల్సిన డబ్బుల్ని చెల్లించడం లేదని, ఇదేంటని అడిగితే సేవలు బాగోనందున, కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు రింగింగ్ బెల్స్ తెలిపిందని సైఫ్యూచర్ సంస్థ సీఈవో అనుజ్ బైరథి తెలిపారు. అయితే తమ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇలా ఏడాదిలోపు , ఎటువంటి నోటీసూ లేకుండా అర్థాంతర కాంట్రాక్టు రద్దు కుదరదని పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ringing Bells  Cyfuture  Fraud case  bpo company  

Other Articles