Smriti Irani is the lady Lion in the Parliament

Smriti irani is the lady lion in the parliament

Smriti Irani, Parliament, Rohith Vemula, JNU, HCU, Modi, Rahul Gandhi

Smriti Irani is the lady Lion in the Parliament. Smriti Irani gave perfect answers on Rohith Vemula and JNU incident.

స్మృతి ఇరానీ.. పార్లమెంట్ లో సివంగి

Posted: 02/25/2016 04:18 PM IST
Smriti irani is the lady lion in the parliament

కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్ లో ప్రతిపక్షపార్టీల గుండెలు అదిరిపోయేలా మాట్లాడారు. నిజానికి పార్లమెంట్ సమావేశాల్లో అధికారపక్షానికి నిద్ర కూడా పట్టనివ్వకూడదని ప్రతిపక్షపార్టీలు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకున్నారు. కానీ పార్లమెంట్ లో మాత్రం సీన్ రివర్సైంది. కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుకు ఊడిందన్నట్లుంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్య దగ్గరి నుండి దిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కన్హయ్య కుమార్ అరెస్టు వరకు అన్నింటా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ నాయకులు ముందు నుండి ఎంతో బాగా ప్రిపేర్ అయ్యారు. కానీ ఒక్క గాలి వానకు రాబందు నేలకొరిగిందన్నట్లు ప్రతిపక్షాలకే షాక్ తగిలింది.

మోదీగారికి యుద్దంలో ఏ ఆయుధాన్ని ఎప్పుడు వాడాలో బాగా తెలుసు. అందుకే అసలు టైంలో మాత్రమే అసలైన, బలమైన ఆయుధాన్ని వాడాలని తెలిసి.. కరెక్ట్ టైంలో స్మృతి ఇరానీ లాంటి నాయకులరాలిని రంగంలోకి దించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆమె మాట్లాడిన మాటలకు స మొత్తం గడగడలాడింది. రాహుల్ గాంధీ తో సహా కాంగ్రెస్ నాయకులకు ఎవరికీ కూడా కనీసం మాట్లాడే ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా స్మృతి ఇరానీ ప్రసంగం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు, దళితులకు రక్షణలేదని.. అలాగే వారిని ప్రభుత్వం తొక్కేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు చూపించే ప్రయత్నాలుు చేశాయి.

రోహిత్ ఆత్మహత్య మీద ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చిత్తశుద్ది ఎంతటిదో కూడా ఆమె వివరించారు. రాహుల్ గాంధీ నియోజక వర్గం అమేధీ నుండి పోటీలో నిలిచి ఓటమిపాలైనా కానీ మోదీ స్మృతి ఇరానీ మేధస్సును మెచ్చి ఆమెకు తన కేబినెట్ లో స్థానం కల్పించారు. అందుకే ఆమె మాట తీరులో మరింత వేగం పెరిగింది. పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు ఎంతో నిక్కచ్చిగా సమాధానమిచ్చిన స్మృతి ఇరానీ అందరి మన్ననలు పొందారు.

రోహిత్ ఆత్మహత్యను రాహుల్ గాంధీ ఎలా రాజకీయం చేశారో ఆమె ఎంతో చక్కగా వివరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అది అక్షరాల నిజం.. వందల మంది తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నా కానీ రాహుల్ గాంధీ కనీసం స్పందించను కూడా స్పందించలేదు.. కానీ ఇప్పుడు మాత్రం రోహిత్ అనే విద్యార్థి చనిపోతే మాత్రం రెండు సార్లు వెళ్లడం మీద రాజకీయ కోణం లేదు అని ఎవరూ కూడా అనలేరు.

యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య తర్వాత తాను, తన మంత్రిత్వ శాఖ ఎలా స్పందించిందో కూడా స్మృతి ఇరానీ వివరించారు. దేశంలో విభజనకు, ఉగ్రవాదానికి మద్దతునిస్తున్నది ఎవరు అని ఆమె ప్రశ్నించారు. దుర్గాదేవిపై జేన్‌యూలో వెలసిన వివాదాస్పద పోస్టర్‌పై స్మృతి స్పందిస్తూ.. ఈ వివరాలు చదివి వినిపించారు.
 
‘‘వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుగతా బోస్‌ చాలా చెప్పారు. దురదృష్టవశాత్తూ... వారు ఇప్పుడు సభలో లేరు. వారికి సవాల్‌ విసురుతున్నాను. నేను చెప్పే అంశం గురించి వారు కోల్‌కతా వీధుల్లో చర్చించగలరా! 2014 అక్టోబర్‌ 14వ తేదీన జేఎన్‌యూకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ‘మహిషాసురుడి అమరత్వం’ అంటూ ఓ పోస్టర్‌ వేశారు. అందులోని అంశాలు చదువుతున్నాను... ఇందుకు ఆ దేవుడు నన్ను క్షమించుగాక! ‘‘దుర్గా పూజ జాతివివక్షా పూరిత పూజ. దుర్గాదేవి.. నల్లటి చర్మం ఉన్న మహిషాసురుడిని క్రూరంగా చంపేసింది. ఆత్మాభిమానం, ధైర్యం ఉన్న మహిషాసురుడు పెళ్లి చేసుకునేలా ఆర్యులు మాయోపాయాలు పన్నారు. వారు దుర్గ అనే సెక్స్‌ వర్కర్‌ను ఇందుకు నియమించారు. మహిషాసురుడు ఆమెను పెళ్లాడేలా చేశారు. 9 రోజుల హనీమూన్‌ తర్వాత మహిషాసురుడు నిద్రిస్తుండగా అతడిని దుర్గ చంపేసింది’’.

‘‘ఇదీ ఆ పోస్టర్‌లో ఉన్నది. ఇదేనా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ? ఈ విషయంపై కోల్‌కతా వీధుల్లో చర్చ జరిపే ధైర్యం ఉందా? రాహుల్‌ ఇలాంటి స్వేచ్ఛకు మద్దతుగా నిలుస్తున్నారా? వీరు విద్యార్థులా... ఇదేం మనస్తత్వం? ఈ ప్రశ్నలకు నా వద్ద సమాధానం లేదు! మొన్నటికి మొన్న రాహుల్‌ యూపీకి వెళ్లి... ‘మొత్తం వైస్‌చాన్స్‌లర్లందరూ ఆర్‌ఎస్ఎస్‌కు చెందినవారే’ అని ఆవేశంగా అన్నారు. వీసీల్లో 16 మంది యూపీఏ నియమించిన వారే. వారిలో ఏ ఒక్కరైనా వచ్చి... నేను కాషాయీకరణ చేశానని చెబితే, రాజకీయాలు వదిలేస్తా!’’అని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ సవాల్ చేశారు.

వాజపేయి నాడు ఇందిరను అపర దుర్గగా కొనియాడారు. ఇదే సభలో ఆయన భారత్ గురించి గొప్పగా చెప్పారు. అదేమిటంటే...

భారత ఏక్‌ తుక్డా నహీహై
జీతాజాగ్‌తా రాష్ట్ర పురుష్‌ హై
ఏ వందన్‌కీ దర్తీ హై
అభిందన్‌కీ దర్తీహై
ఏ అర్పణ్‌కీ భూమీహై
ఏ తర్పణ్‌కీ భూమీహై
ఇస్‌కీ నదీ నదీ హమారే లియే గంగా హై
కంకడ్‌ కంకడ్‌ హమారే లియే శంకర్‌ హై
జియేంగే భారతకే లియే
మరేంగే భరతకే లియే.
మరణ్‌కే బాద్‌బీ... గంగా జల్‌మే బెహ్‌తీహుయీ అస్థికోకీ కోయీ
కాన్‌లగేకీ సునేగాతో ఏకీ అవాజ్‌ ఆయేగీ
ఓహై... భారత మాతాకీ జై!  అని అన్నారు.

అధికార పక్షం మీద ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేసినా కానీ స్మృతి ఇరానీ మాత్రం కాదు.. కాదు మా ప్రభుత్వం కడిగిన ముత్యం అని నిరూపించింది. అయినా బిజెపి పార్టీలో స్మతి ఇరానీ లాంటి మాటల మారఠీ... అందునా ఆమెనే స్వయంగా హెఆర్డీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఆమెను తక్కువ అంచనా వేశాయి. మోదీ, రాజ్ నాథ్ సింగ్ లు స్మృతి ఇరానీని మెచ్చుకున్నారు. మోదీ స్మృతి ఇరానీ ప్రసంగాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయినా స్మృతి ఇరానీలాంటి నాయకురాలు పార్లమెంట్ లో సివంగా శివాలెత్తుతుంటే ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెలుజారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  Parliament  Rohith Vemula  JNU  HCU  Modi  Rahul Gandhi  

Other Articles